ETV Bharat / international

ట్రంప్ వర్సెస్​ ట్విట్టర్​ : కీలక ఉత్తర్వులకు అధ్యక్షుడు ఓకే - Trump signs executive order targeting social media giants after Twitter fact-checking row

సామాజిక మాధ్యమాలే లక్ష్యంగా కీలక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ సంతకం చేశారు. ట్విట్టర్​లో తాను చేసిన ట్వీట్లకు ఫ్యాక్ట్ చెక్​ వార్నింగ్​ పంపడంపై ఈ నిర్ణయం తీసుకున్నారు​ ట్రంప్​.

Trump signs executive order targeting social media giants after Twitter fact-checking row
ట్రంప్ వర్సెస్​ ట్విట్టర్​ : కీలక ఉత్తర్వులకు అధ్యక్షుడు ఓకే
author img

By

Published : May 29, 2020, 10:13 AM IST

సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్​, ఫేస్​బుక్​ వంటి సంస్థలే లక్ష్యంగా తెచ్చిన కార్యనిర్వాహక​ ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంతకం చేశారు. తాను చేసిన​ పోస్టులకు ట్విట్టర్​ ఫ్యాక్ట్​ చెక్​ వార్నింగ్​ పంపిన ఒక రోజు వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్​. ఎన్నికల విషయంలో సామాజిక మాధ్యమాలు తటస్థంగా ఉండకుండా.. జోక్యం చేసుకుంటున్నాయని ట్రంప్​ ఆరోపించారు.

" అమెరికన్ల వాక్​ స్వాతంత్య్రం, హక్కులను రక్షించేందుకు ఈ రోజు ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్​పై సంతకం చేశాను."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

తాజా ఉత్తర్వులతో సమాచార సభ్యత చట్టంలోని సెక్షన్​ 230 ప్రకారం.. సామాజిక మాధ్యమాలపై సరికొత్త నిబంధనలు విధించనున్నారు ట్రంప్​. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల అధికారులు అటార్నీ జనరల్​తో కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు.

ఫ్యాక్ట్​ చెక్​ వార్నింగ్​​

తన ట్వీట్లకు ఫ్యాక్ట్​ చెక్​ వార్నింగ్​ పంపడంపై ట్రంప్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సామాజిక మాధ్యమ సంస్థలపై కొత్త నియంత్రణలు విధిస్తామని, అవసరమైతే మూసేయడానికీ వెనుకాడబోమని గురువారమే హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.