ETV Bharat / international

ఇద్దరు ఫేస్​బుక్​ రారాజులు త్వరలో కలవబోతున్నారు!

author img

By

Published : Feb 15, 2020, 10:42 AM IST

Updated : Mar 1, 2020, 9:47 AM IST

ఫేస్​బుక్​లో తొలి స్థానంలో ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యాఖ్యానించారు. రెండో స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారన్న జుకర్​బర్గ్​ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు అన్నారు.

Trump Modi
ట్రంప్ మోడీ

ఫేస్​బుక్​లో అత్యంత ఆదరణ ఉన్న వ్యక్తుల్లో తాను తొలి స్థానం, నరేంద్రమోదీ రెండో స్థానంలో ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారతదేశ పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

"ఇది గొప్ప గౌరవమని అనుకుంటున్నాను. 'ఫేస్​బుక్​లో తొలి స్థానంలో డొనాల్డ్ ట్రంప్​ ఉన్నారు' అని మార్క్​ జుకర్​బర్గ్​ చెప్పారు. రెండో స్థానంలో భారత ప్రధానమంత్రి మోదీ ఉన్నారు. రెండు వారాల్లో ఇండియాకు వెళ్తున్నాను. ఈ పర్యటన కోసం ఎదురుచూస్తున్నాను."-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఫేస్​బుక్​లో తొలి స్థానం సంపాదించడంపై ఇదివరకే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు ట్రంప్. గత నెలలో జరిగిన దావోస్​ ఆర్థిక సదస్సులో భాగంగా సీఎన్​బీసీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం దీనిపై మాట్లాడారు. "నేను ఫేస్​బుక్​లో నెం.1లో ఉన్నాను. రెండో స్థానం ఎవరో తెలుసా? భారత్​ నుంచి మోదీ." అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత పర్యటనకు రానున్నారు డొనాల్డ్ ట్రంప్​. న్యూదిల్లీతో పాటు గుజరాత్​లోని అహ్మదాబాద్​ను సందర్శించనున్నారు. అక్కడ నిర్వహించే భారీ రోడ్​షోలో పాల్గొననున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన భారీ క్రికెట్​ స్టేడియాన్ని ప్రారంభించనున్నారు.

ఇదీ చదవండి: ట్రంప్ భారత పర్యటన విజయవంతమవుతుంది.. కానీ!

Last Updated : Mar 1, 2020, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.