ETV Bharat / international

కరోనా వైరస్​ వల్ల ఎంతో కోల్పోయా: ట్రంప్​ - అమెరికా వార్తలు

కరోనా వైరస్​ కారణంగా తన ముఖాన్ని కొన్ని వారాలుగా తాకట్లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చమత్కరించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ట్రంప్​... తన ముఖాన్ని చాలా మిస్సవుతున్నట్లు చెప్పారు.

trump
కరోనా
author img

By

Published : Mar 5, 2020, 6:13 AM IST

Updated : Mar 5, 2020, 7:36 AM IST

కరోనా వైరస్​ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను​ కూడా భయపెడుతోంది. వైరస్​ సోకకుండా తీసుకునే జాగ్రత్తలతో ఇబ్బంది పడుతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు.

పరిశుభ్రతకు సంబంధించి ఎయిర్​లైన్​, పరిపాలన విభాగాలకు చెందిన అధికారులతో భేటీ అయ్యారు ట్రంప్. కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు.

అధికారుల వివరణ

విమానాల్లో శుభ్రతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ట్రంప్​నకు వివరించారు అధికారులు. ఈ సందర్భంగా శ్వేతసౌధ కరోనా వైరస్​ స్పందన సమన్వయకర్త డెబోరా మాట్లాడుతూ.. "చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.. ముఖాన్ని చేతులతో ముట్టుకోకపోవటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది" అని వివరించారు.

దీనిపై స్పందించిన ట్రంప్​ ఛలోక్తి విసిరారు. తనకు క్రిములంటే భయమని చెప్పారు. కొన్ని వారాలుగా నా ముఖాన్ని తాకలేదు.. చాలా మిస్సవుతున్నానంటూ నవ్వులు పూయించారు.

9 మంది మృతి..

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. వీరంతా వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందినవారే. బాధితుల సంఖ్య 100దాటినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ట్రంప్​ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

Last Updated : Mar 5, 2020, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.