ETV Bharat / international

శ్వేతసౌధానికి చేరుకున్నారు.. మాస్క్​ తీసేశారు!

వాల్టర్​ రీడ్​ మిలిటరీ ఆసుపత్రి నుంచి వైట్​హౌస్​కు చేరుకున్నారు ట్రంప్​. అమెరికా అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగవ్వలేదని డాక్టర్లు చెబుతున్నప్పటికీ.. ట్రంప్​ తన మాస్క్​ను తీసేశారు. అనంతరం.. కరోనా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని డొనాల్డ్​ ట్విట్టర్​లో వీడియో విడుదల చేయడం గమనార్హం.

Trump removes mask after returning to White House
శ్వేతసౌధానికి చేరుకున్నారు.. మాస్క్​ తీసేశారు!
author img

By

Published : Oct 6, 2020, 10:07 AM IST

సైనిక ఆసుపత్రిలో కొవిడ్​ చికిత్స పొందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఇవాళ ఉదయం డిశ్ఛార్జి అయ్యారు. శ్వేతసౌధానికి చేరుకున్న తర్వాత ట్రంప్​.. మాస్క్​ను తీసేయడం చర్చనీయాంశమైంది.

మాస్కు తీసేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెలికాఫ్టర్​​ నుంచి దిగగానే లిఫ్ట్​లో కాకుండా సౌత్​ పోర్టికో మెట్ల నుంచి బ్లూరూమ్​ బాల్కనీ ద్వారా శ్వేతసౌధంలోకి చేరుకున్నారు ట్రంప్. బాల్కనీలో తన మాస్కును తీసేసి జేబులో పెట్టుకున్నారు. కింద ఉన్న జనాలను చూస్తూ విజయ సంకేతాన్ని ఇచ్చారు.

కానీ, ట్రంప్​ ఆరోగ్యం అప్పుడే పూర్తిగా కుదుటపడలేదని.. శ్వేతసౌధ​​ ఫిజిషియన్​ డాక్టర్​ సీన్​ కోన్లీ చెబుతున్నారు.

"ట్రంప్​ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని అప్పుడే చెప్పలేం. నేను, మా సిబ్బంది శ్వేతసౌధంలో ట్రంప్​ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక్కడ ఆయనకు ప్రపంచ స్థాయి వైద్యం అందుతుంది."

-డాక్టర్​ సీన్​ కోన్లీ, శ్వేతసౌధ వైద్యుడు

కరోనాకు భయపడొద్దు: ట్రంప్

  • I will be leaving the great Walter Reed Medical Center today at 6:30 P.M. Feeling really good! Don’t be afraid of Covid. Don’t let it dominate your life. We have developed, under the Trump Administration, some really great drugs & knowledge. I feel better than I did 20 years ago!

    — Donald J. Trump (@realDonaldTrump) October 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకుముందు.. ట్రంప్​ తాను వాల్టర్​ రీడ్​ ఆసుపత్రి నుంచి వస్తున్నట్లు ట్విట్టర్​లో తెలిపారు. కొవిడ్‌ గురించి ఎవరూ భయపడొద్దని అమెరికా ప్రజలకు సూచించారు. జీవితాలపై వైరస్‌ ఆధిపత్యం ప్రదర్శించకుండా చూసుకోవాలని హితవు పలికారు. కరోనా నియంత్రణకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తన పాలనలో అద్భుతమైన ఔషధాలు అభివృద్ధి అయ్యాయన్నారు. అందరం కలిసి ఈ మహమ్మారిని ఓడించాలని పిలుపునిచ్చారు. తన మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.