ప్రతిభ ఆధారిత వలస విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే ఈ చట్టంపై సంతకం చేయనున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా దేశానికి వచ్చే వలసదారుల పిల్లలకు సంబంధించిన డీఏసీఏ విషయాన్ని పరిశీలించనున్నట్లు స్పష్టం చేశారు.
"త్వరలోనే ఇమ్మిగ్రేషన్ చట్టంపై సంతకం చేయబోతున్నాను. ఈ చట్టం ప్రతిభ ఆధారంగా, చాలా శక్తిమంతంగా ఉంటుంది. డీఏసీఏ(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) విషయాన్నీ పరిశీలించబోతున్నాం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఈ సందర్భంగా డెమొక్రాట్లపై విరుచుకుపడ్డారు ట్రంప్. డీఏసీఏను డెమొక్రాట్లు రాజకీయం కోసం ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. తన ప్రభుత్వం తీసుకురానున్న శక్తిమంతమైన ఇమ్మిగ్రషన్ చట్టాన్ని దేశం 25 ఏళ్లుగా కోరుకుంటోందని చెప్పారు.
సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన వ్యక్తుల పిల్లలను డీఏసీఏ కింద పరిగణిస్తారు. డీఏసీఏ ప్రకారం వీరికి అమెరికాలో పనిచేసుకునే వీలు లభిస్తుంది. దాదాపు 7 లక్షల మందిపై ఈ చట్టం ప్రభావం చూపుతోంది. ఇందులో చాలా వరకు భారత్, దక్షిణాసియా దేశాలవారే ఉండటం గమనార్హం.
ఇదీ చదవండి- 'మోదీజీ... పరువు పోతోంది... అర్థమవుతోందా?'