కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరంగా అతిపెద్ద తప్పిదానికి పాల్పినట్లేనని ఓ ప్రముఖ అమెరికన్ దినపత్రిక పేర్కొంది. భారత్‌తో సంబంధాల్లో పూర్వ అధ్యక్షులు సాధించిన విజయాలను ట్రంప్ నీరుగారుస్తున్నారని మండిపడింది.
మోదీ అడిగారు
జపాన్ ఒసాకాలో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ... కశ్మీర్ అంశంలో తనను మధ్యవర్తిగా ఉండి, సహాయం చేయమని కోరారని ట్రంప్ పేర్కొన్నారు.
అంతలేదు
ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కశ్మీర్ విషయంలో సహాయం చేయమని ట్రంప్‌ను మోదీ కోరలేదని స్పష్టం చేసింది. 'కశ్మీర్' పూర్తిగా భారత్, పాక్‌ల ద్వైపాక్షిక సమస్య అని, చర్చల ద్వారా తామే తేల్చుకుంటామని తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని పార్లమెంట్లో విదేశాంగమంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.
భారత్‌తో స్నేహానికి గండి
అమెరికన్ దిగుమతులపై భారత్ అధికంగా సుంకాలు విధిస్తోందంటూ భారత్‌పైనా వాణిజ్య యుద్ధానికి తెరతీశారు ట్రంప్. అది కాస్తా సద్దుమణిగింది అనుకునే లోపు.. ఇప్పుడు మధ్యవర్తిత్వం చేస్తానంటూ ప్రకటించి వివాదానికి కారణమయ్యారు. ఈ తప్పుడు చర్యలతో భారత్‌ను దూరం చేసుకుని.. చైనాను నిలువరించడానికి ఉన్న ఏకైక అవకాశాన్ని అమెరికా చేజార్చుకుంటోందని ఆ పత్రిక పేర్కొంది.
ఇదీ చూడండి: రాజీవ్ హత్యకేసు నిందితురాలు నళిని విడుదల