ETV Bharat / international

ట్రంప్​ వెబ్​సైట్​ హ్యాక్..​ భారీ కుంభకోణానికి యత్నం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార వెబ్​సైట్ హ్యాక్​కు గురైంది. విజిటర్ల నుంచి నిధులు వసూలు చేసి క్రిప్టోకరెన్సీ కుంభకోణానికి పాల్పడేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. అయితే కొద్ది సేపటికే వెబ్​సైట్​న్​ను పునరుద్ధరించినట్లు ట్రంప్ ప్రచార డైరెక్టర్​ టిమ్​ ముర్టాఫ్​ తెలిపారు.

Trump campaign website hacked with cryptocurrency scam
ట్రంప్​ వెబ్​సైట్​ హ్యాక్​ చేసి కుంభకోణానికి యత్నం
author img

By

Published : Oct 28, 2020, 8:56 PM IST

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రచార వెబ్​సైట్​ను హ్యాక్​ చేసి క్రిప్టో కరెన్సీ కుంభకోణానికి పాల్పడేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. వెబ్​సైట్​లో నకిలీ సీబీఐ నోటీస్​ పోస్ట్ చేశారు. ట్రంప్ తప్పు చేశారని రుజువు చేసే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. ఆ పత్రాలను బహిర్గతం చేయాలా వద్దా అనే విషయంపై వీక్షకులు ఓటింగ్​లో పాల్గొనాలని హ్యాకర్లు వెబ్​సైట్​లో తెలిపారు. రెండు క్రిప్టో కరెన్సీ వాలెట్లకు నిధులు పంపాలని కోరారు. అయితే కొద్దిసేపటికే వెబ్​సైట్​ను పునరుద్ధరించినట్లు ట్రంప్ ప్రచార, కమ్యూనికేషన్స్​ డైరక్టర్​ టిమ్ ముర్టాఫ్ ట్విట్టర్​లో తెలిపారు.

హ్యాకింగ్​కు ఎవరు పాల్పడరానే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు టిమ్​. వెబ్​సైట్​లో ఎలాంటి సున్నితమైన వివరాలు దాయలేదని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ మూలానికి ట్రంప్ ప్రభుత్వం ప్రమేయం ఉందని, 2020 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు విదేశీ నటులతో ట్రంప్​ సంప్రదింపులు జరిపారని హ్యాకర్లు వెబ్​సైట్​లో పోస్ట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.