విజయంపై నమ్మకం కోల్పోకూడదని మద్దతుదారులకు సూచించారు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్. అమెరికాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ప్రస్తుతం ఉన్న ఫలితాల సరళితో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.
విస్కాన్సిన్, మిషిగన్ రాష్ట్రాల్లో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. చివరి బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యే వరకు విశ్వాసంతో ఉండాలని మద్దతుదారులకు సూచించారు బైడెన్. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని స్పష్టం చేశారు.
ట్రంప్ కూడా..
బైడెన్ ప్రకటన చేసిన కాసేపటికే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
-
We are up BIG, but they are trying to STEAL the Election. We will never let them do it. Votes cannot be cast after the Polls are closed!
— Donald J. Trump (@realDonaldTrump) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are up BIG, but they are trying to STEAL the Election. We will never let them do it. Votes cannot be cast after the Polls are closed!
— Donald J. Trump (@realDonaldTrump) November 4, 2020We are up BIG, but they are trying to STEAL the Election. We will never let them do it. Votes cannot be cast after the Polls are closed!
— Donald J. Trump (@realDonaldTrump) November 4, 2020
"మనం భారీ విజయం సాధించబోతున్నాం. కానీ, వాళ్లు ఎన్నికలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మేము జరగనీయబోం. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్లు వేయలేం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అయితే, ఈ ట్వీట్‌ను 'తప్పుదోవ పట్టించే సమాచారం'గా పరిగణిస్తూ ట్విట్టర్ హెచ్చరించింది. ఈ ట్వీట్‌కు ఫ్యాక్ట్ చెక్ ఫ్లాగ్ జతచేసింది.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బైడెన్ ముందంజలో ఉన్నారు. కానీ, కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది.
ఇదీ చూడండి: ఆ రాష్ట్రాల్లో ట్రంప్ గెలిస్తే ఫలితాలు తారుమారే!