ETV Bharat / international

కాలి వేళ్లలో సమస్య.. కరోనా లక్షణమా? - కాలి వేళ్లలో సమస్య

కాలి వేళ్లు వాచి ఎర్రగా మారుతున్న కేసులు అమెరికా, స్పెయిన్​, బెల్జియం, ఇటలీ తదితర దేశాల్లో పెరిగిపోతున్నాయి. సాధారణగా శీతాకాలంలో ఉండే ఈ సమస్య ప్రస్తుతం గణనీయంగా పెరగటం ఆందోళన కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి వారికి కొవిడ్‌-19 నిర్ధరణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

The problem of toes is a corona symptom
కాలి వేళ్లలో సమస్య
author img

By

Published : May 3, 2020, 6:38 AM IST

సాధారణంగా శీతల దేశాల్లో.. ముఖ్యంగా చలి కాలంలో కొందరిలో కాలి వేళ్లు వాచి ఎర్రగా మారి నొప్పిపెడుతుంటాయి. ఇప్పుడు అమెరికా, స్పెయిన్‌, బెల్జియం, ఇటలీ తదితర దేశాల్లో అనేక మంది ముఖ్యంగా చిన్నపిల్లలు, యువకులు ఈ సమస్యతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు తీవ్ర చలికాలం కాదు. అలానే ఆయా వ్యక్తుల్లో ఎక్కువమంది గతంలో ఈ సమస్య బారిన పడలేదు. అయినా ఎందుకీ సమస్య పెరుగుతుందనేది వైద్యులకు అంతుపట్టడంలేదు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఇలాంటివారికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

"వారిలో ఎలాంటి కరోనా లక్షణాలూ కనిపించడంలేదు. కానీ అకస్మాత్తుగా ఈ కేసులు పెరిగిపోతుండడం వల్ల ఇవి కరోనాకు సంకేతాలా అనే కోణంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది"

- చర్మవ్యాధుల నిపుణులు

అయితే.. కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆయా వ్యక్తులు కరోనా బారిన పడి, రోగనిరోధక శక్తి కారణంగా దాని నుంచి కోలుకున్నారనడానికి ఇది సంకేతమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ ఫాక్స్‌ చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.