ETV Bharat / international

అమెరికాకు మిరుమిట్లు గొలిపే భవిష్యత్తు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన అనంతరం సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. అమెరికా కలలు పునఃస్థాపితమయ్యాయన్నారు ట్రంప్. వాణిజ్యం, రక్షణ సహా కరోనా వైరస్​పై తీసుకుంటున్న చర్యలను వివరించారు.

trump
అమెరికాకు మిరుమిట్లు గొలిపే భవిష్యత్తు: ట్రంప్
author img

By

Published : Feb 5, 2020, 11:02 AM IST

Updated : Feb 29, 2020, 6:13 AM IST

అమెరికాకు మిరుమిట్లు గొలిపే భవిష్యత్తు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మూడోసారి కాంగ్రెస్ ఉభయసభలు వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన నాయకత్వంలో సాధించిన ఆర్థిక పురోగతిపై వివరించారు. అమెరికా కలలు పునఃస్థాపితమయ్యాయని, దేశం ఇంతకుముందెప్పుడు లేనంత పటిష్ఠంగా ఉందన్నారు.

"ఆర్థిక క్షీణత సమయం ముగిసిపోయింది. హామీల విస్మరణ, నిరుద్యోగం, నెరవేరని ప్రకటనలు, సర్దిచెప్పుకోవడాలు.. అమెరికా సంపదను, శక్తిని, గౌరవాన్ని కుంగదీశాయి. అయితే కలల అమెరికా మళ్లీ వెనక్కి వచ్చింది. అతి పెద్దదైన, నాణ్యమైన, బలమైన అమెరికాను నిర్మించాలన్న కల వెనక్కి వచ్చింది. నేను బాధ్యతలు తీసుకున్న అనంతరం అమెరికా ఆర్థిక ప్రగతిని పునరుత్తేజితం చేసేందుకు.. ఉద్యోగాల కల్పనకు ప్రమాదంగా పరిణమించిన నిబంధనలపై ఉక్కుపాదం మోపాం. నా ఎన్నిక అనంతరం 70 లక్షల నూతన ఉద్యోగాలను సృష్టించాం."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఆఫ్రికా, హిస్పానిక్, ఆసియా అమెరికన్లలో తమ పాలనలోనే అతి తక్కువ నిరుద్యోగిత నమోదైందన్నారు ట్రంప్.

వాణిజ్య చర్చలపై..

గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా నుంచి చైనా ప్రయోజనాలు పొందుతుందన్న ట్రంప్ ప్రస్తుతం ఈ పరిస్థితిని మార్చామన్నారు. అయితే చైనాతో ఇంతకుముందెప్పుడు లేని ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నామని ఉద్ఘాటించారు. చైనాతో చారిత్రక వాణిజ్య ఒప్పందాన్ని చేసినట్లు వెల్లడించారు.

మెక్సికో సరిహద్దుపై..

మెక్సికోతో సంబంధం కలిగిన దక్షిణ సరిహ్దదు రక్షణపై తీసుకుంటున్న చర్యలపై వివరించారు ట్రంప్. అక్రమంగా చొరబడిన వారిని ఉపేక్షించబోమని, చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించిన వారిని రక్షిస్తామన్నారు.

కరోనాపై

చైనాలో ఉత్పన్నమయిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్​పై చైనా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామన్నారు.

ఎన్నికల నేపథ్యంలోనే..

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకే ట్రంప్ ఈ ప్రసంగం చేశారని సమాచారం. తనపై జరుగుతున్న అభిశంసన తీర్మానం నుంచి బయటపడతానని ఈ ప్రసంగం ద్వారా అధ్యక్షుడు విశ్వాసం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఈనెల చివర్లో భారత్​కు ట్రంప్​.. వాణిజ్య ఒప్పందంపై సంతకం!

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/activist-urvashi-chudawala-files-for-anticipatory-bail-in-mumbai-court20200205090633/

Conclusion:
Last Updated : Feb 29, 2020, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.