కరోనా వైరస్‌ను తట్టుకునేలా మానవులలో రోగనిరోధక శక్తి పెంచే వ్యాక్సిన్‌పై చివరి దశ ట్రయల్స్ నిర్వహించనుంది అమెరికాలోని టెక్సాక్స్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ. దీనికోసం ఆరోగ్య కార్యకర్తలు ముందుకు రావాలని వినతి చేస్తోంది. మనుషులపై వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు ఫెడరల్ క్లియరెన్స్ అనుమతి పొందిన తొలి యూనివర్సిటీ ఇదే కావడం గమనార్హం.
ఈ బీసీజీ వ్యాక్సిన్‌తో కరోనావైరస్ను పూర్తి నిలువరించలేనప్పటికీ దానితో పోరాడగల రోగనిరోధక శక్తిని పెంపొందించవచ్చని టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేంత వరకు దీని ద్వారా మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.బ్లాడార్ క్యాన్సర్ చికత్సకు ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఇది సురక్షితమని ఉప్పటికే రుజువైనందు వల్ల కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు మరో ఆరోనెలల్లో అందుబాటులోకి రావచ్చని పరిశోధకులు అంటున్నారు.
బీసీజీ వ్యాక్సిన్‌తో మొదట ఆరోగ్య కార్యకర్తలపై మాత్రమే ట్రయల్స్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. 1800 మందిని దీనికోసం నియమించనున్నట్లు వివరించారు. కరోనా వైరస్ మానవుల కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతోందని ఆధారాలున్నాయన్నారు.
ఎఫ్‌డీఏ ఆమోద ముద్ర లభించినందుకు వ్యాక్సిన్‌పై మొదటి మూడు దశల ప్రయోగం అవసరం లేదు. చివరిదైన నాలుగో దశ ట్రయల్స్‌ను ఈవారంలోనే ప్రారంభించనున్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్దిలో ముందుకు సాగేందుకు టెక్సాస్ ఏఅండ్ ఎం యూనివర్సిటీకి 2.5 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం లభించనుంది.