భూమి సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నట్లు అమెరికా వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది మే నెలలో నమోదైన ప్రపంచ సగటు ఉష్ణోగ్రత.. గత శతాబ్దిలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రతను అధిగమించిందని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ పరిశోధకలు తెలిపారు. అయితే ఇది 2016 మేలో నమోదైన పుడమి సరాసరి ఉష్ణోగ్రతకు సమానమని చెప్పారు.
మే నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 60.3 డిగ్రీలుగా రికార్డైనట్లు వెల్లడించారు పరిశోధకులు. ఇది 20వ శతాబ్దిలో నమోదైన సరాసరి పుడమి ఉష్ణోగ్రత కంటే 1.7 డిగ్రీలు ఎక్కువని పేర్కొన్నారు. అటు సముద్ర ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే ఉన్నట్లు తెలిపారు. భూమి సగటు ఉష్ణోగ్రత తరువాతి స్థానంలో సముద్ర ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వివరించారు.
ఆఫ్రికా, ఆసియా, పశ్చిమ ఐరోపా, దక్షిణ అమెరికా దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.
ఇదీ చూడండి: తల్లికి కరోనా ఉన్నా బిడ్డకు పాలివ్వొచ్చు: డబ్ల్యూహెచ్ఓ