ETV Bharat / international

అమెరికా వైద్యుల శుభవార్త- ఆ పద్ధతితో కరోనాకు చెక్! - corona latest news

కరోనా రోగులకు ఎలాంటి చికిత్స చేయాలి? ఇది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. అందుకే రకరకాల విధానాలు అవలంబిస్తున్నారు వైద్యులు. తాజాగా... ఏఆర్​డీఎస్​ కేసుల్లో చేసే చికిత్సను కరోనా బాధితులకు అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చని తేల్చారు అమెరికా వైద్యులు.

most critical COVID-19 patients survive with standard treatment
అమెరికా వైద్యుల శుభవార్త-ఆ పద్ధతి ద్వాారా కరోనాకు చికిత్స
author img

By

Published : May 8, 2020, 1:21 PM IST

ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారికి సరైన చికిత్సను కనుగొనేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వేళ అమెరికాలోని రెండు ఆస్పత్రుల వైద్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. శ్వాసకోశ వ్యవస్థ విఫలమైనప్పుడు చేసే చికిత్సను ఆరోగ్యం విషమించిన కరోనా రోగులకు అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు.

అమెరికా బోస్టన్​లోని మసాచుసెట్స్​ జనరల్​ హాస్పిటల్​, బెత్​ ఇస్రాయెల్​ డీకోనెస్​ మెడికల్ సెంటర్​ వైద్యులు కరోనా రోగుల వివరాలను పరిశీలించారు. ఆరోగ్యం విషమించి వెంటిలేటర్లపై చికిత్స తీసుకున్న 66 మంది రోగుల రికార్డులను అధ్యయనం చేశారు. ప్రాణాంతక అక్యూట్​ రెస్పిరేటరీ డిస్ట్రెస్​ సిండ్రోమ్(ఏఆర్​డీఎస్​) కారణంగానే రోగులు తీవ్రంగా ప్రభావితమవున్నట్లు గుర్తించారు. దీని ద్వారానే ఊపిరితిత్తులు ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు నిర్ధరణకు వచ్చారు.

"ఏఆర్​డీఎస్​పై మేము 50 ఏళ్లుగా పరిశోధన చేస్తున్నాం. ఏఆర్​డీఎస్​ రోగులకు చికిత్స అందించేందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిని కరోనా రోగులపై ప్రయోగించాం. ఏఆర్​డీఎస్​ బాధితుల తరహాలోనే కరోనా రోగులూ ఆ చికిత్సకు సానుకూలంగా స్పందించారు" అని వివరించారు మసాచుసెట్స్​ ఆస్పత్రి వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డా. కోరే హార్డిన్.

కరోనా రోగులకు ఈ విధానంలో చికిత్స అందిస్తే మరణాల రేటు 16.7 శాతం(సాధారణంకన్నా తక్కువగా) ఉంటుందని నిపుణులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.