ETV Bharat / international

Pulitzer:భారత సంతతి పాత్రికేయులకు ప్రతిష్ఠాత్మక అవార్డు - మేఘా రాజగోపాలన్

భారత సంతతికి చెందిన ఇద్దరు పాత్రికేయులకు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ ప్రైజ్ లభించింది. మేఘా రాజగోపాలన్, పాత్రికేయుడు నీల్ బేడికి ఈ పురస్కారం దక్కింది.

pulitzer
మేఘా రాజగోపాలన్, నీల్ బేడి
author img

By

Published : Jun 12, 2021, 8:05 AM IST

Updated : Jun 13, 2021, 7:53 AM IST

భారత సంతతికి చెందిన ఇద్దరు సాహసోపేత పాత్రికేయులను ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌ పురస్కారం వరించింది. చైనాలోని కల్లోలిత షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ప్రభుత్వ దురాగతాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన 'బజ్‌ఫీడ్‌ న్యూస్‌' జర్నలిస్టు మేఘా రాజగోపాలన్‌ 'అంతర్జాతీయ రిపోర్టింగ్‌' విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అక్కడ లక్షల మంది ముస్లింలను నిర్బంధించడానికి భారీగా నిర్మించిన రహస్య కారాగారాలను ఆమె తన వినూత్న పరిశోధనాత్మక కథనాలతో బట్టబయలు చేశారు.

భారత సంతతికి చెందిన మరో పాత్రికేయుడు నీల్‌ బేడికీ ఈ పురస్కారం లభించింది. భవిష్యత్‌లో నేరానికి పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి అమెరికాలోని ప్యాస్కో కౌంటీలో స్థానిక భద్రత అధికారులు తెచ్చిన ఒక కంప్యూటర్‌ మోడలింగ్‌లోని లోపాలను ఎత్తిచూపుతూ రాసిన కథనాలకు క్యాథలీన్‌ మెక్‌ గ్రోరీతో కలిసి ఆయన అవార్డును పంచుకోనున్నారు. సదరు మోడలింగ్‌ ద్వారా చిన్నారులు సహా దాదాపు వెయ్యి మందిపై అధికారులు నిఘా పెట్టారు. నీల్‌.. 'తంపా బే టైమ్స్‌'లో పనిచేస్తున్నారు.

స్టార్ ట్రిబ్యూన్​కు..

ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌(Pulitzer) బహుమతిని అమెరికా పత్రిక 'స్టార్‌ ట్రిబ్యూన్‌'(Star Tribune) గెలుచుకుంది. గతేడాది మేలో జరిగిన జార్జి ఫ్లాయిడ్‌ హత్య ఘటనను వివరిస్తూ ఇచ్చిన కథనాలకుగాను పురస్కారానికి ఎంపిక చేసినట్లు పులిట్జర్‌ బోర్డు ప్రకటించింది. అసోసియేటెడ్‌ ప్రెస్‌కు చెందిన ఇద్దరు ఫొటోగ్రాఫర్లు.. ఎమిలో మోరెనాటి, జులియో కార్టెజ్‌ కూడా పులిట్జర్‌ బహుమతికి ఎంపికయ్యారు.

ఫ్లాయిడ్‌ హత్యానంతర నిరసనల దృశ్యాలను, ప్రజల జీవితాల్లో కరోనా వైరస్‌ నింపిన విషాదాన్ని తమ కెమేరాల్లో బంధించినందుకు ఈ పురస్కారాలు దక్కాయి. మోకాలితో మెడపై నొక్కుతూ జార్జి ఫ్లాయిడ్‌ను కర్కశంగా పోలీసు చంపివేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించిన ఒక యువకుడు డార్నేల్లా ఫ్రేజియర్‌కు పులిట్జర్‌ ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని ప్రకటించింది. కొవిడ్‌ మహమ్మారిపై లోతైన, సవివర కథనాలను అందించిన 'న్యూయార్క్‌ టైమ్స్‌' పత్రికకు ప్రజా సేవ విభాగంలో అవార్డు దక్కింది.

ఇదీ చదవండి:'వ్యాక్సిన్ల విషయంలో భారత్​కు మద్దతు'

Last Updated : Jun 13, 2021, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.