అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. గత రెండు దశాబ్దాల కాలంలో ఇదే అతిపెద్దదని తెలిపారు అధికారులు. భూకంప లేఖినిపై తీవ్రత 6.4గా నమోదైనట్లు పేర్కొన్నారు.
రిడ్జర్క్రెస్ట్ పట్టణానికి 10 కి.మీ దూరంలో కౌంటీ సీర్లెస్ లోయ ఎడారి ప్రాంతంలో 10:33 గం.లకు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావం చుట్టుపక్కల 250 కి.మీ వరకు వ్యాపించినట్లు వెల్లడించారు.
ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరోసారి భూకంపం వచ్చే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
పరిస్థితిపై ట్రంప్ ట్వీట్
దక్షిణ కాలిఫోర్నియాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.
-
Been fully briefed on earthquake in Southern California. All seems to be very much under control!
— Donald J. Trump (@realDonaldTrump) July 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Been fully briefed on earthquake in Southern California. All seems to be very much under control!
— Donald J. Trump (@realDonaldTrump) July 4, 2019Been fully briefed on earthquake in Southern California. All seems to be very much under control!
— Donald J. Trump (@realDonaldTrump) July 4, 2019
" భూకంపం గురించి అధికారులు వివరించారు. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది."
-ట్రంప్ ట్వీట్
ఇదీ చూడండి: చైనాలో ప్రచండ గాలులకు ఆరుగురు బలి