ETV Bharat / international

టిష్యూలు, మాస్క్​ల కోసం క్యూలైన్లలో పడిగాపులు - CORONA VIRUS MASK DEMAND

అమెరికాలో కరోనా ప్రభావం టిష్యూ పేపర్​ మీద పడింది. వీటి కొనుగోలు కోసం ప్రజలు గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోంది. కొవిడ్-19 నుంచి రక్షణ దిశగా. మెక్సికో సిటీ పరిధిలోని చర్చిల్లో ఆరోగ్య నిబంధనలను ఆదివారం నుంచి అమల్లోకి తెచ్చినట్లు మతాధికారులు ప్రకటించారు. అదే విధంగా ఫ్రాన్స్​లో ప్రార్థనా కార్యక్రమాల విధానంలో మార్పులకు క్రైస్తవ మతపెద్దలు ఆదేశాలు జారీ చేశారు.

shoppers can be seen making long lines for toilet paper as rush to keep up with heightened demand.
కరోనా: టిష్యూలు, మాస్క్​ల కోసం క్యూలైన్లలో పడిగాపులు!
author img

By

Published : Mar 2, 2020, 12:42 PM IST

Updated : Mar 3, 2020, 3:42 AM IST

కరోనా వైరస్... యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక మహమ్మారి. ఆరోగ్యపరంగానే కాక... ఆర్థిక రంగంలోనూ వైరస్ పెను ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు కరోనా నుంచి రక్షణకు పెద్దస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికానూ కరోనా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ నిత్యావసరాల వస్తువులకన్నా టిష్యూ​ పేపర్​కు గిరాకీ ఏర్పడింది. గంటలపాటు క్యూలైన్లలో నిల్చొని మరీ టిష్యూ పేపర్​ను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.

దక్షిణ కొరియాలో...

చైనా తర్వాత ఎక్కువ కరోనా కేసులు దక్షిణ కొరియాలో నమోదయ్యాయి. అక్కడ 4వేల మందికిపైగా వైరస్​ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొవిడ్​-19 బారి​ నుంచి రక్షణ కోసం మాస్క్​లను ధరించేందుకు మొగ్గు చూపుతున్నారు కొరియా వాసులు. మాస్క్​ల కోసం ఉదయం నుంచే క్యూలైన్లలో నిల్చొని మరీ కొనుగోలు చేస్తున్నారు.

టిష్యూలు, మాస్క్​ల కోసం క్యూలైన్లలో పడిగాపులు!

మెక్సికోలో..

మెక్సికో నగరంలో ఇప్పటివరకు ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా నుంచి రక్షణ కోసం మెక్సికో సిటీ కెథిడ్రల్ మతాధికారులు వారి పరిధిలోని చర్చిలకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని ఆదివారం నుంచి అమలులోకి తీసుకొచ్చారు. ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల అత్యవసర పరిస్థితిని విధించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పలు రెస్టారెంట్లు, వ్యాపార దుకాణాలను మూసి వేశారు. ఈ నేపథ్యంలో మాస్క్​లకు, చేతి రుమాళ్లకు డిమాండ్​ ఏర్పడింది. దుకాణదారులు ఎక్కువ రేట్లకు వీటిని విక్రయిస్తున్నారు.

ప్రార్థనా విధానంలో మార్పులు..

ఫ్రాన్స్​లో కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో మత పెద్దలు ప్రార్థన కార్యక్రమాల విధానంలో మార్పులు చేశారు. ప్రార్థనా సమయంలో ఒకరినొకరు కరచాలనం చేసుకోకూడదని తెలిపారు. చర్చి ప్రాంతమంతా పవిత్ర జలాన్ని చల్లాలని పేర్కొన్నారు.

Last Updated : Mar 3, 2020, 3:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.