ETV Bharat / international

నమస్తే ట్రంప్​: ఆశలపై నీళ్లు- ట్రేడ్​ డీల్​ లేనట్టే! - america president

భారత్​-అమెరికా వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడు తొలిసారి భారత్​కు వస్తున్న సందర్భంగా ఒప్పందం కుదురుతుందని భావిస్తున్న తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్​ ట్రంప్​. ఈ పర్యటనలో ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఉండబోదని స్పష్టం చేశారు ట్రంప్​. అయితే భవిష్యత్తులో చేసుకోబోయే ఒప్పందం గొప్పగా ఉంటుందని పేర్కొన్నారు.

Saving big trade deal with India for later: Trump
నమస్తే ట్రంప్​: ఆశలపై నీళ్లు- ట్రేడ్​ డీల్​ లేనట్టే!
author img

By

Published : Feb 19, 2020, 6:33 PM IST

Updated : Mar 1, 2020, 9:02 PM IST

నమస్తే ట్రంప్​: ఆశలపై నీళ్లు- ట్రేడ్​ డీల్​ లేనట్టే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత్​ పర్యటనలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరేలా కనిపించటం లేదు. ఒప్పందంపై ట్రంప్​ సంతకం చేస్తారని అంతా భావిస్తున్న తరుణంలో అందరి ఆశలపై నీళ్లు చల్లారు అగ్రరాజ్య అధినేత. భారత్​తో ఒప్పందం చేసుకుంటామని... అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇది జరుగుతుందా లేదా అనేది చెప్పలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. మున్ముందు భారత్​తో భారీ వాణిజ్య ఒప్పందం ఉంటుందని స్పష్టం చేశారు.

భారత్​-అమెరికా వాణిజ్య సంబంధాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ట్రంప్​.

"భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చు. కానీ ఇప్పుడే కాదు. ఈ ఒప్పందం ఎన్నికల ముందు ఉంటుందా అన్నది తెలియదు. అయితే, మున్ముందు భారీ ఒప్పందం కుదుర్చుకుంటాం. భారత్‌ మాతో సరిగ్గా వ్యవహరించలేదు. కానీ.. ప్రధాని మోదీ అంటే నాకు చాలా ఇష్టం. విమానాశ్రయం నుంచి కార్యక్రమం వేదిక వరకు 70 లక్షల మంది ప్రజలు హాజరవుతారని మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మైదానం (మోటేరా)లో కార్యక్రమం జరగనుంది. నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

భారత్‌కు రానున్న ట్రంప్ బృందంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి లైట్‌హైజర్‌ ఉండే అవకాశం లేదని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

పలుమార్లు చర్చలు..

కొద్ది వారాల క్రితం వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​తో అమెరికా వాణిజ్య ప్రతినిధి లైట్​హైజర్​ ఫోన్​ద్వారా పలుమార్లు చర్చలు జరిపారు.

సుంకాల తగ్గింపునకు భారత్​ డిమాండ్​

భారత ఉత్పత్తులైన ఉక్కు​, అల్యూమినియంపై భారీగా విధిస్తున్న సుంకాలను తగ్గించాలని భారత్​ డిమాండ్​ చేస్తోంది. జీఎస్​పీ హోదా కింద కొన్ని ఉత్పత్తులకు ఎగుమతుల ప్రయోజనాలు పునరుద్ధరించాలని కోరుతోంది. వ్యవసాయ, వాహనాలు, వాహన విడిభాగాలు​, ఇంజినీరింగ్​ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్​ సౌకర్యం కల్పించాలని పట్టుబడుతోంది.

మార్కెట్​ కల్పించాలని అమెరికా ఒత్తిడి..

అమెరికాలోని వ్యవసాయ, తయారీ రంగ ఉత్పత్తులు, డైరీ, వైద్య పరికరాలకు మార్కెట్​ సౌకర్యం కల్పించాలని, ఐసీటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించాలని ఒత్తిడి చేస్తోంది అగ్రరాజ్యం. 2018-19లో 16.9 బిలియన్​ డాలర్ల మేర వాణిజ్య లోటు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇరు దేశాల వాణిజ్య వృద్ధిలో క్షీణత..

ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధిలో ఇటీవలి త్రైమాసికంలో క్షీణత నమోదైనట్లు అమెరికా-భారత్​ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక(యూఎస్​ఐఎస్​పీఎఫ్​) ఓ నివేదికలో తెలిపింది. 8.4 శాతం నుంచి 4.5 శాతానికి పడిపోయినట్లు లెక్కగట్టింది. ఇందుకు ఆర్థిక మందగమనం, యూఎస్​-చైనా వాణిజ్య యుద్ధం, జీఎస్​పీ ఉపసంహరణ, అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు కారణమని పేర్కొంది.

ప్రస్తుత సగటు వాణిజ్య వార్షిక వృద్ధి రేటు 7.5గా ఇలాగే కొనసాగితే 2025 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 238 బిలియన్​ డాలర్లకు చేరుకుంటుందని యూఎస్​ఐఎస్​పీఎఫ్​ అంచనా వేసింది.

ప్రస్తుతం వస్తు, సేవల వాణిజ్యంలో భారత్​కు అమెరికా అతిపెద్ద భాగస్వామిగా ఉంది. వస్తువుల వాణిజ్యంలో 65 శాతం, సేవల విభాగంలో 38 శాతంగా ఉంది. చైనాతో భారత వాణిజ్యం వృద్ధి 2018లో 13 శాతంగా ఉంటే, అమెరికాతో 18 శాతం వృద్ధి నమోదైంది.

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: రక్షణ రంగంలోనే కీలక ఒప్పందాలు!

Last Updated : Mar 1, 2020, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.