శనిగ్రహ వలయంలో మరో 20 చందమామలను అమెరికా శాస్ర్రజ్ఞులు కనుగొన్నారు. శనిగ్రహం చుట్టూ ఉన్న చందమామల సంఖ్య 82కి చేరింది. ఇవి దాదాపు ఐదు కిలోమీటర్ల వ్యాసంతో ఉన్నట్లు తెలిపారు. ఇందులో 17 చందమామలు శనిగ్రహ భ్రమణానికి వ్యతిరేక దిశలో పరిభ్రమిస్తున్నాయని, మరో మూడు చందమామలు శనిగ్రహ అనుకూల దిశలో పరిభ్రమిస్తున్నాయని తెలిపారు.
అమెరికాలోని కార్నెగీ ఇన్స్టిట్యూషన్ ఫర్ సైన్స్ పరిశోధకులు ఈ మేరకు అంతర్జాతీయ ఖగోళ యూనియన్ మైనర్ ప్లానెట్ కేంద్రంలో వివరాలను ప్రకటించారు.
కాల పరిమితి
అందులో రెండు చందమామలు శనిగ్రహానికి దగ్గరగా ఉన్నాయని, అవి మరో రెండు సంవత్సరాల పాటు కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తాయని శాస్త్రజ్ఞులు తెలిపారు. శనిగ్రహ కక్ష్య దిశలో తిరుగుతున్న మరో చంద్రుడు, మిగిలిన పదిహేడు చందమామలు శని చుట్టూ పరిభ్రమాణాన్ని పూర్తి చేసుకోవటానికి దాదాపు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ పడుతుందని చెప్పారు.
పెద్ద చందమామ మూలాలు
ఈ చందమామల కక్ష్యను బట్టి వాటి మూలాలు, అలాగే శని ఏర్పడిన నాటికి చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రోగేడ్ మోషన్లో తిరుగుతున్న చందమామలు ఏళ్లనాటి కింద పెద్ద చందమామ నుంచి విడిపోయి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అలాగే వ్యతిరేక దిశలో తిరుగుతున్న చందమామలు కూడా పెద్ద చంద్రుడి నుంచే విడిపోయి ఉంటాయన్నారు.
వేగంగా తిరిగే చందమామ
శనిగ్రహం కక్ష్య చుట్టూ తిరిగే చందమామలలో రిట్రోగ్రేడ్ మోషన్ చందమామలు వేగంగా ప్రయాణిస్తున్నాయని తెలిపారు.
శనిగ్రహ కక్ష్యలో ఉన్న ప్రోగేడ్ మోషన్ చందమామల సమూహాన్ని గాలిక్ సమూహం అని అంటారు.
జూపిటర్ను దాటేసింది...
గతంలో జూపిటర్కు 79 చందమామలు ఉండేవి. మిగతా గ్రహాలలోని చంద్రుల కంటే వీటి సంఖ్య ఎక్కువుండేది. ఇప్పుడు ఆ సంఖ్యను శనిగ్రహం అధిగమించింది. మొత్తంగా చందమామల సంఖ్య 82కి చేరింది.
ఇదీ చూడండి : ఫార్చ్యూన్ హీరోల జాబితాలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు