ETV Bharat / international

'గాంధీ సోలార్​ పార్క్' ప్రారంభం.. బాపూజీ స్టాంపు విడుదల​ - modi inuagurates gandhi solar park

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 'గాంధీ సోలార్​ ​పార్క్'​ను వివిధ దేశాధినేతలతో కలసి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. గాంధీ 150వ జయంతి సందర్భంగా ఐరాస రూపొందించిన బాపూజీ పోస్టల్​ స్టాంపును విడుదల చేశారు. మహాత్ముడు ఎన్నడూ వ్యక్తిగతంగా కలవని వారిలోనూ ఆయన జీవన విధానం ఎంతో స్ఫూర్తిని నింపిందని ఉద్ఘాటించారు మోదీ.

'గాంధీ సోలార్​ పార్క్' ప్రారంభం.. బాపూజీ స్టాంపు విడుదల​
author img

By

Published : Sep 25, 2019, 7:51 AM IST

Updated : Oct 1, 2019, 10:27 PM IST

మహాత్మా గాంధీ జీవితకాలంలో ఎవరినీ ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదని కానీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన సోలార్​ పార్క్​ను బంగ్లాదేశ్ అధినేత్రి షేక్ హసీనా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్​తో కలిసి మోదీ ప్రారంభించారు.

'సమకాలీన ప్రపంచంపై గాంధీజీ ముద్ర' అనే శీర్షికతో ఐరాస వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. భారత స్వాతంత్ర్యానికి మాత్రమే కాదని.. ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకోవడానకి గాంధీ అనుసరించిన మార్గం ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు మోదీ.

"గాంధీజీ తన జీవితం ద్వారా ఇతరులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదు. కానీ ఆయన జీవించిన విధానమే ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం మనం 'ఎలా ఆకట్టుకోవాలనే' లక్ష్యంతో బతుకుతున్నామని... కానీ గాంధీ విధానం 'ఎలా స్ఫూర్తి నింపాలనే' దానిపై ఆధారపడి ఉంది. "

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

పనిలేకుండా ఉండటాన్ని గాంధీజీ ఒప్పుకునేవారు కాదని, విలువలు లేని వ్యాపారాన్ని, మానవత్వం లేని శాస్త్ర సాంకేతికత, త్యాగం లేని మతం, విలువలు లేని రాజకీయాలకు ఆయన వ్యతిరేకంగా పనిచేసేవారని తెలిపారు మోదీ.

గాంధీ 150 స్టాంపు విడుదల...

ఈ ఏడాది మహాత్ముడి 150 జయంతిని పురస్కరించుకుని ఐరాస రూపొందించిన స్టాంపును వివిధ దేశాల అగ్రనేతలతో కలిసి మోదీ విడుదల చేశారు.

'బంగ్లా పోరాటానికి మహాత్ముడే స్ఫూర్తి'

సాధారణ ప్రజల పట్ల మహాత్మా గాంధీకి ఉన్న ప్రేమ, అహింస సిద్ధాంతం బంగ్లాదేశ్ జాతిపిత బంగాబంధు షేక్​ ముజిబుర్​ రెహమాన్​ను ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు ఆ దేశ ప్రధానమంత్రి షేక్​ హసీనా. పాకిస్థానీ అరాచకాలకు వ్యతిరేకంగా మహాత్ముడి మార్గంలో శాంతియుత పోరాటం చేసి 1971లో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి: గాంధీ 150: మృత్యు భయాన్ని జయించిన మహాత్ముడి కథ

New York (USA), Sep 25 (ANI): Prime Minister Narendra Modi on Sep 24 said the $2.5 billion worth MoU signed by India's Petronet in the energy sector of the United States, will generate 50,000 jobs, and a trade of $60 million will come from the energy deal in the coming decades. "As far as trade (India-US trade) is concerned, I am happy that our Petronet signed an MoU of US$ 2.5 Billion investment in the energy sector. As a result of this, there will be a trade of US$ 60 Million in the coming decades and 50,000 people will get jobs," PM Modi said during his bilateral meeting with US President Donald Trump on the sidelines of the United Nations General Assembly session in New York.
Last Updated : Oct 1, 2019, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.