అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ(Modi US Visit).. అగ్రరాజ్యానికి చెందిన 5 దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. డిజిటల్ ఇండియా(Digital India Modi), 5జీ సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధన రంగం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మోదీ(Modi news).. సీఈఓలకు పిలుపునిచ్చారు.
డిజిటల్ ఇండియా..
ముందుగా క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో ఆమోన్‌తో సమావేశమైన ప్రధాని... డిజిటల్ ఇండియా, 5జీ సాంకేతికతపై చర్చించారు. ప్రధాని మోదీతో(Modi US Visit 2021) నిర్మాణాత్మక చర్చలు జరిగాయని, భారత్‌తో భాగస్వామి కావడం గర్వంగా ఉందని సమావేశం అనంతరం క్రిస్టియానో ఆమోన్ ట్వీట్ చేశారు.
ఆ తరువాత అడోబ్ ఛైర్మన్ శంతను నారాయణ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ(Modi in US) అయ్యారు. భారత్‌లో అడోబ్ కార్యకలాపాలు, భవిష్యత్తు పెట్టుబడి ప్రణాళికలపై చర్చించారు. ప్రధానితో భేటీ అనంతరం అడోబ్ ఛైర్మన్ శంతను నారాయణ్ స్పందించారు. ఇరువురి మధ్య పెట్టుబడులు, సాంకేతికత వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. సాంకేతికత ఆధారంగా దేశంలోని యువతకు 'స్మార్ట్' విద్యా బోధన.. పరిశోధనల వేగవంతం, స్టార్టప్ రంగానికి ఊతం వంటి అంశాలను మోదీకి వివరించినట్లు పేర్కొన్నారు. భారత్‌లో అడోబ్ కార్యకలాపాలు, భవిష్యత్తు పెట్టుబడి ప్రణాళికలపై చర్చించారు.
అలాగే 'అడోబ్‌కు అతిపెద్ద ఆస్తి ప్రజలేనని.. భారత్‌లో విద్యను ప్రోత్సహించడం, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం అనేది అడోబ్‌తో పాటు దేశానికి మద్దతుగా నిలుస్తుందని' అభిప్రాయపడ్డారు. విద్యాభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.
సౌర పరికరాల తయారీ వ్యూహం..
అనంతరం ఫస్ట్ సోలార్ సీఈవో మార్క్ విడ్మార్‌తో జరిగిన భేటీలో.. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడి అవకాశాలను మోదీ వివరించారు.
ఆ తర్వాత.. జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్‌లాల్‌తో సమావేశమైన ప్రధాని మోదీ.. భారత్‌లో రక్షణ రంగ ఉత్పత్తులు, ఆధునిక సాంకేతిక వినియోగంపై చర్చించారు. మోదీతో అత్యుత్తమ సమావేశం జరిగిందని జనరల్ అటామిక్స్ సీఈఓ వివేక్ లాల్ అన్నారు. టెక్నాలజీ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. భారత్‌లో అమలవుతున్న విధానపర సంస్కరణలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిట్టచివరిగా బ్లాక్‌స్టోన్ సీఈఓ స్టీఫెన్ ఎ ష్వార్జ్‌మెన్‌తో భేటీ అయిన ప్రధాని.. మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. భేటీ అనంతరం బ్లాక్‌స్టోన్ గ్రూప్ సీఈఓ స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్ స్పందిస్తూ.. భారత ప్రభుత్వం చేపడుతున్న వివిధ మౌలిక సదుపాయాలతో పెట్టుబడులు ఊపందుకుంటాయని పేర్కొన్నారు. ప్రధానంగా జాతీయ మోనటైజేషన్ పైప్‌లైన్ ప్రాజెక్టుతో అందివచ్చే పెట్టుబడి అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి: