వందేళ్ల క్రితం నీట మునిగిన టైటానిక్ ఓడ 1,500 మంది ప్రయాణికులను జల సమాధి చేసింది. గత 35 ఏళ్లుగా నీటిలో ఈ ఓడ చెంతకు వెళ్లి వస్తున్నవారు.. మానవ శకలాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఉపయోగం లేదని నౌక రక్షిత హక్కులు పొందిన కంపెనీ చెబుతోంది.
అయితే ఈ ఓడలోని అరుదైన రేడియో పరికరాలను తిరిగి సంపాదించాలని కంపెనీ చేస్తున్న ప్రయత్నం విస్తృతమైన చర్చకు దారి తీస్తోంది. ఈ ఓడలోని మార్కోని వైర్లెస్ టెలిగ్రాఫ్ మిషన్ను సేకరించి ప్రదర్శనకు పెట్టాలన్నది రక్షిత కంపెనీ ఉద్దేశం. ప్రమాద సమయంలో ఓడ సముద్రంలో మునుగుతున్న శబ్దాలను, అసహాయుల కేకలను ప్రసారం చేసిన మార్కోని వైర్లెస్ టెలిగ్రాఫ్ మిషన్ 700 మందిని లైఫ్బోట్లతో కాపాడేందుకు దోహదపడింది.
ఇదీ చూడండి: తైవాన్ ఆక్రమణకు చైనా సన్నాహాలు?