అమెరికా అభివృద్ధి చేసిన ఫైజర్ వ్యాక్సిన్.. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో ఇటీవల విజృంభిస్తోన్న కొత్తరకం కరోనా వైరస్ నుంచీ రక్షణ కల్పిస్తుందని పరిశోధనల్లో తేలింది. నిరంతరం తన రూపాన్ని మార్చుకుంటోన్న మహమ్మారిపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న వేళ.. టీకా సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు గాల్వెస్టన్లోని టెక్సాస్ మెడికల్ బ్రాంచ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఫైజర్ పరిశోధకులతో కలిసి ఈ అధ్యయనం చేశారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 20 మందిలోని యాంటీబాడీలు.. విజయవంతంగా వైరస్ను నిరోధిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే.. మరింత అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: 2020లో 'చెమటోడ్చిన' ఆస్ట్రేలియన్లు