ETV Bharat / international

అమెరికా అమ్ములపొదిలో అత్యంత వేగవంతమైన క్షిపణి!

ధ్వనికన్నా 5 రెట్ల వేగంతో దూసుకెళ్లే క్షిపణిని అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. అత్యంత దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థను కూడా ఈ క్షిపణి ఛేదిస్తుందని పెంటగాన్​ వర్గాలు తెలిపాయి.

Pentagon says successfully tested hypersonic missile
అమెరికా అమ్ములపొదిలో అత్యంత వేగవంతమైన క్షిపణి
author img

By

Published : Mar 21, 2020, 7:58 AM IST

అనార్మ్​డ్​ ప్రొటోటైప్​ హైపర్​సోనిక్​ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ తెలిపింది. ధ్వని కన్నా 5 రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణి.. దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థలను కూడా ఛేదిస్తుందని పెంటగాన్ ప్రకటించింది.

2017 అక్టోబర్​లో అమెరికా సైనిక విభాగం, నౌకా విభాగం ఉమ్మడిగా చేసిన ప్రయోగాంలో కొన్ని సమస్యలు తలెత్తాయని.. తాజా పరీక్షల్లో హైపర్​సోనిక్​ వేగంతో లక్ష్యం దిశగా పయనించిందని పెంటగాన్ తెలిపింది.

అమెరికా అమ్ములపొదిలో అత్యంత వేగవంతమైన క్షిపణి

బాలిస్టిక్​, క్రూయిజ్​ల కంటే..

అణు బాంబులను కూడా మోసుకెళ్లే సామర్థ్యం ఈ హైపర్​సోనిక్​ క్షిపణులకు ఉంటుంది. ప్రస్తుతం అణుబాంబులను మోసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్న బాలిస్టిక్​, క్రూయిజ్​ క్షిపణుల కన్నా ఎక్కువ ఎత్తులో, వేగంగా ఈ హైపర్​సోనిక్ మిస్సైళ్లు ప్రయాణిస్తాయి. ఫలితంగా శత్రు రక్షణ వ్యవస్థలను ఈ క్షిపణి సులభంగా ఓడిస్తుంది.

రష్యా తొలిసారి..

హైపర్​సోనిక్​ వేగంతో ప్రయాణించే 'అవన్​గార్డ్​' క్షిపణులను తయారు చేసినట్లు గత డిసెంబర్​లో రష్యా ప్రకటించింది. ఇలాంటి క్షిపణులను రూపొందించిన తొలి దేశంగా రష్యా నిలిచింది. ఇవి గంటకు సుమారు 33వేల కిలోమీటర్లు లేదా మాక్​-27 వరకు ఉంటుందని రష్యన్​ అధికారులు చెప్పారు.

చైనా కూడా హైపర్​సోనిక్​ క్షిపణుల అభివృద్ధికి గణనీయమైన పెట్టుబడులు పెడుతోంది. గతేడాది అక్టోబర్​లో సైనిక కవాతులో భాగంగా.. డీఎఫ్​-17 హైపర్​సోనిక్​ గ్లయిడ్​ వాహనాన్ని ప్రదర్శించింది.

ఇదీ చదవండి: విదేశీయుల వీసాల గడువును పొడిగించిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.