ETV Bharat / international

'మీతో పాటు.. సైన్యమూ నిర్ణయం తీసుకోవాలి' - పాకిస్థాన్​

పాకిస్థాన్​లో తీవ్రవాద నిర్మూలనకు ​ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ సరైన చర్యలు చేపట్టామని చెప్పినట్లుగానే ఆ దేశ సైన్యం కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలని అమెరికా పేర్కొంది. తీవ్రవాద సంస్థలకు మద్దతు పలికే పాక్​ విధానాలను మార్చేందుకు ప్రయత్నాలు చేపడుతున్నట్లు తెలిపింది.

'మీతో పాటు.. సైన్యమూ నిర్ణయం తీసుకోవాలి'
author img

By

Published : May 3, 2019, 6:32 AM IST

Updated : May 3, 2019, 7:57 AM IST

'మీతో పాటు.. సైన్యమూ నిర్ణయం తీసుకోవాలి'

ఉగ్రవాదంపై పాకిస్థాన్​ సరైన చర్యలు చేపడుతోందన్న ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖలను పేర్కొంటూ.. ఆ దేశ సైన్యం కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్​ పరిపాలన విభాగం ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

తీవ్రవాద సంస్థలకు మద్దతు తెలిపే పాక్​ విధానాలను మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని అగ్రరాజ్య పరిపాలన విభాగం సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. పాక్​ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని.. పాక్​లోని పరిస్థితులను సైన్యం చక్కబెడుతుందని ఆశిస్తున్నామన్నారు. తీవ్రవాదంపై సైన్యాధికారులు కూడా సరైన నిర్ణయాలు, విధానాలు చేపట్టాలన్నారు.

తీవ్రవాదంపై చర్యలు తీసుకున్నామన్న పాకిస్థాన్​ను అభినందిస్తున్నామని తెలిపారు ఆ అధికారి. గతంలో జరిగిన విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడే పూర్తిస్థాయిలో పాక్​ను ప్రశంసించలేమన్నారు. కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

జైషే మహ్మద్​ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించటం క్లిష్టమైన చర్యగా పేర్కొన్నారు. అతని ప్రయాణ నిషేధం, ఆస్తుల జప్తు వంటి ఇతర చర్యలను చేపట్టేందుకు పాకిస్థాన్​ బాధ్యత ముఖ్యమైనదిగా తెలిపారు. వారు ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి జవాబుదారీగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: ఆ ఒక్క మార్కు వచ్చి ఉంటే: సీబీఎస్​ఈ టాపర్​

Gadchiroli (Maharashtra), May 02 (ANI): Wreath laying ceremony of 15 security personnel who lost their lives in a Naxal attack was performed in Maharashtra's Gadchiroli today. Maharashtra Chief Minister Devendra Fadnavis paid his tribute. People swarmed to witness the ceremony and pay their respects to the slain soldiers. 15 security personnel lost their lives in an IED blast attack that took place on May 1.

Last Updated : May 3, 2019, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.