ETV Bharat / international

కరోనాను జయించినా... కొద్ది రోజులకే మళ్లీ అనారోగ్యం! - అమెరికా శాస్త్రవేత్తలు

కరోనా సోకి, అత్యవసర విభాగంలో చికిత్స పొంది డిశ్చార్జ్​ అయిన వారు మళ్లీ ఆసుపత్రిలో చేరుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. 10 మంది బాధితుల్లో ఒకరు తిరిగి ఆసుపత్రికి వస్తున్నట్లు అమెరికా పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. వీరిలో ఆక్సిజన్​ స్థాయి తక్కువగా ఉండటం, జ్వరం వంటి లక్షణాలు కలిగిన వారే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.

One in 10 COVID-19 patients return to hospital after being sent home from ER: US Study
కరోనాను జయించిన తిరిగి ఆసుపత్రి పాలవుతున్న బాధితులు
author img

By

Published : Sep 16, 2020, 6:29 PM IST

అత్యవసర విభాగంలో చికిత్స పొంది కోలుకున్న అనంతరం 10 మంది కరోనా బాధితుల్లో ఒకరు తిరిగి వారంలోనే ఆసుపత్రిలో చేరుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మొదటి మూడు నెలల్లో చికిత్స పొందిన 1400 మందికిపైగా రోగుల వైద్య నివేదికలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను అకడెమిక్ ఎమర్జెన్సీ మెడిసిన్ మ్యాగజైన్​లో ప్రచురించారు. మార్చి నుంచి మే నెలల మధ్య కాలంలో అమెరికా ఫిలడెల్ఫిలియా ప్రాంతంలోని కరోనా రోగులపై ఈ అధ్యయనం చేశారు.

కరోనాను జయించిన వారు ఆక్సిజన్​ స్థాయిలో తగ్గుదల, జ్వరం వంటి లక్షణాల కారణంగా తిరిగి ఆసుపత్రిలో చేరుతున్నట్లు అమెరికా పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు ఆస్టిన్​ కిలారు వివరించారు. ఈ అధ్యయనం ప్రకారం అత్యవసర విభాగంలో చికిత్స పొందిన వారిపై వైద్యులు మరింత దృష్టి సారించవలసి ఉంటుందని కిలారు అభిప్రాయపడ్డారు.

1419 మందిపై పరిశోధన...

మార్చి 1 నుంచి మే 28 మధ్య కాలంలో అత్యవసర విభాగంలో చికిత్స పొంది డిశ్చార్జ్​ అయిన 1,419 మంది బాధితులపై అధ్యయనం చేశారు. వీరందరికీ ఇంటికి వెళ్లిన ఏడు రోజుల్లో కరోనా పరీక్షలను నిర్వహించారు. వీరిలో 4.7 శాతం మంది బాధితులు తిరిగి మూడు రోజుల్లో ఆసుపత్రిలో చేరగా... మరో 3.9 శాతం మంది వారంలోపే చేరారు. మొత్తం 8.6 శాతం మంది రోగులు తిరిగి అత్యవసర విభాగంలో చేరారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.