ETV Bharat / international

'ఆ మాట అన్నందుకు అతని ముక్కు విరగ్గొట్టాను' - బరాక్​ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్నేహితుడు చేసిన జాతివిద్వేష వ్యాఖ్యలకు అతని ముక్కు విరగ్గొట్టానని వెల్లడించారు.

obama
'ఆ మాట అన్నందుకు అతని ముక్కువిరగకొట్టాను'
author img

By

Published : Feb 24, 2021, 9:34 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా స్థానిక మీడియాతో మంగళవారం జరిగిన ఇంటర్య్వూ సందర్భంగా జాతివివక్షకు సంబంధించి తన అనుభవాలను పంచుకున్నారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు స్నేహితుడు తనపై జాతివిద్వేష వ్యాఖ్యలు చేసినందుకు అతని ముక్కు విరగ్గొట్టి బుద్ధి చెప్పానన్నారు.

"అతనూ నేను కలిసి బాస్కెట్​బాల్​ ఆడేవాళ్లం. ఓ రోజు లాకర్​ రూమ్​లో మా మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అతను నన్ను కించ పరిచేలా జాతివిద్వేష వ్యాఖ్యలు చేశాడు. బుద్ధి చెప్పేందుకు మొహం మీద దాడి చేసేసరికి అతని ముక్కు విరిగింది. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించాను."

-బరాక్​ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు

అవతల వ్యక్తిపై అమానవీయంగా ప్రవర్తించడం వ్యవస్థలో భాగమైపోయిందని ఒబామా వ్యాఖ్యానించారు. జాతివివక్షపై తొలిసారిగా ఒబామా బహిరంగంగా తన అనుభవాలను పంచుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది.

ఇదీ చదవండి : 'దేశవ్యాప్తంగా మాస్కుల పంపిణీకి బైడెన్ సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.