ETV Bharat / international

'భారతీయ మహిళలకు శృంగారమంటే తెలియదు' - భారత మహిళలపై అమెరికా మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ (రిపబ్లికన్ పార్టీ), ఆయన జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిసింజర్​లు భారతీయులపై ముఖ్యంగా మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నిక్సన్ భారతీయ మహిళలు అత్యంత అందవిహీనులని గతంలో నోరుపారెసుకున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. దీనితో పాటు భారత్​పై నిక్సన్ మరిన్ని విషయాల్లోసూ అక్కసు వెళ్లగక్కారు. ఇందుకు సంబంధించి టేపుల రూపంలోని ఆధారాలు తాజాగా వెల్లడయ్యాయి.

Nixon's hatred towards Indians
అమెరికా మాజీ ఆధ్యక్షుడు నిక్సన్ భారత్​పై అక్కసు
author img

By

Published : Sep 6, 2020, 10:48 AM IST

పాకిస్థాన్​తో 1971లో జరిగిన యుద్ధంలో అమెరికా వైఖరి భారత్​కు అనుకూలంగా లేదు. పాక్​కే మద్దతు ఇచ్చింది. ఇందుకు అమెరికా స్వప్రయోజనాల కన్నా అప్పటి అధ్యక్షుడి జాతి వివక్షే కారణం. 1969 నుంచి 1974 వరకు అమెరికా 37వ అధ్యక్షుడిగా పనిచేసిన రిచర్డ్​ నిక్సన్​(రిపబ్లికన్​ పార్టీ), ఆయన జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిసింజర్​లకు భారతీయులంటే చాలా చులకన భావం ఉండేది. ఇదే వారి విధానాల్లోనూ ప్రతిఫలించింది. ఇందుకు సంబంధించి టేపుల రూపంలోని ఆధారాలు తాజాగా వెల్లడయ్యాయి.

1971 జూన్​లో శ్వేత సౌధంలోని ఓవల్​ ఆఫీసులో నిక్సన్​తో పాటు, అప్పటి చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​ హెచ్​.ఆర్​.హాల్డ్​మన్​లతో జరిగిన సమావేశంలో నిక్సన్​ భారతీయ మహిళలపై నోరు పారేసుకున్నారు. ''వారు ప్రపంచంలోనే అత్యంత అనాకర్షణీయమైనవారు. సందేహం లేదు. శృంగారమంటే తెలియదు. దరిద్రంగా ఉంటారు.'' అని అన్నారు.

అసలు వారెవరికైనా నచ్చుతారా?

1971 నవంబరు నాలుగో తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శ్వేత సౌధంలో నిక్సన్​తో భేటీ అయ్యారు. విరామం సందర్భంగా నిక్సన్​.. కిసింజర్​తో మాట్లాడుతూ మళ్లీ భారతీయ మహిళలపై వ్యాఖ్యలు చేశారు. ''వారు నాకు నచ్చరు. అసలు వారెవరికైనా నచ్చుతారా? చెప్పు హెన్రీ'' అని అన్నారు. భారతీయ మహిళలతో శృంగారమంటే ఇష్టపడనంటూ ఉపన్యాసమే ఇచ్చారు. దీనికి కిసింజర్​ ఇచ్చిన సమాధానం స్పష్టంగా వినిపించలేదు. అయితే అది అధ్యక్షుని వ్యాఖ్యలను ఖండించేదిగా మాత్రం లేదు.

అదే నెలలో భారత్​-పాక్​ ఘర్షణలపై కిసింజర్​, అప్పటి విదేశాంగ మంత్రి రోగెర్స్​లతో చర్చిస్తున్నప్పుడు కూడా భారత మహిళలపై నోరు పారేసుకున్నారు. ''వారు ఎలా పిల్లల్ని కంటారో'' అని వ్యాఖ్యానించారు.

బంగ్లా శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడంపై కిసింజర్​ మండిపడ్డారు. భారతీయులను పాకీపనివారని తిట్టి పోశారు. బంగ్లాదేశీయులను వధిస్తున్న పాక్​ వైఖరిని తప్పుపట్టి అది జాతి నిర్మూలన చర్యలా ఉందని విమర్శించిన భారత్​లో అమెరికా రాయబారి కెన్నెత్​ కీటింగ్​పైనా కిసింజర్​ మండిపడ్డారు. అలా అంటావా అని నిలదీశారు. ఇది కూడా నిక్సన్​ సమక్షంలో శ్వేత సౌధంలోనే జరిగింది.

భారతీయులు పొగడ్తలతో పడేస్తారని మరోసందర్భంలో కిసింజర్​ వ్యాఖ్యానించారు. ''పొగడడంలో వారికి మించినవారు లేరు. ఈ పొగడ్తలతోనే వారు గత 600 ఏళ్లుగా కాలం గడుపుతున్నారు. కీలక పదవుల్లో ఉన్నవారిని పట్టుకోవడంలో వారికి నైపుణ్యం ఉంది. '' అని అక్కసు బయటపెట్టుకున్నారు.

పాక్​పై అభిమానం..

పాకిస్థానీయులను పొగడడంలోనూ కిసింజర్​ తన అభిమానాన్ని దాచుకోలేదు. ''వారు చాలా మంచివారు. అయితే ఆలోచనల్లో మొరటు''అని అన్నారు.

పాకిస్థాన్​కు మద్దతు ఇవ్వడానికి కారణాలు కూడా లేకపోలేదు. అప్పటివరకు చైనా-అమెరికాల మధ్య సంబంధాలు లేవు. చైనాతో సంబంధాలు పెంచుకోవడానికి పాక్​ సాయం తీసుకోవడంతోనే ఆ దేశానికి మద్దతు తెలిపారు. పాక్​లో సైనిక పాలనకు వంతపాడారు. ఇంతవరకు రహస్య పత్రాలుగా ఉన్న ఈ టేపులను ప్రిన్స్​టన్​ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్​ గ్యారీ బాస్​ సేకరించారు. వీటిని క్రోడీకరించి న్యూయార్క్​ టైమ్స్​లో వ్యాసం రాశారు. ఇవన్నీ దిగ్భ్రాంతికర సంభాషణలన్నారు. అమెరికా అధ్యక్షులు అనుసరించిన జాతివ్యతిరేక విధానాలే విదేశీ వ్యవహారాలపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు.

ఇలాంటి మాటలకే పదవి ఊడింది..

నిక్సన్​ వ్యాఖ్యలు అనాగరికం, అహంకారపూరితమని నాటి తరం దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వైఖరివల్లనే ఆయన పదవిని పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి నట్వర్​ సింగ్​ మాట్లాడుతూ ''నిక్సన్​ తక్కువస్థాయి వ్యక్తి. ఇలాంటి ప్రవర్తన కారణంగానే వాటర్​ గేట్​ కుంభకోణంలో అభిశంసనకు గురయి పదవి కోల్పోయారు. బంగ్లాదేశీయులను ఊచకోత కోసిన పాక్​కు మద్దతు ఇచ్చినందుకు 20 ఏళ్ల తరువాత కిసింజర్​ క్షమాపణలు కోరారు. నిక్సన్​ అది కూడా చేయలేదు. అమెరికా చర్యలను ఇందిరాగాంధీ సమర్థంగా తిప్పికొట్టారు.'' అని తెలిపారు.

ఆ సమయంలో యువ ఐఎఫ్​ఎస్​ అధికారిగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్​ అయ్యర్​ తన అభిప్రాయం చెబుతూ ' నిక్సన్​ మాటలు అసభ్యకరం. అప్పట్లో అమెరికా యువకుల వ్యవహార శైలి కూడా ఇలాగే ఉండేది. ఇతర నాయకుల మాదిరిగా ఇందిరాగాంధీ తనకు భయపడడం లేదన్న భావన నిక్సన్​లో ఉండేది. పరిస్థితిని గమనించిన ఇందిర బంగ్లాదేశ్​ యుద్ధం సమయంలో తన సొంత పద్ధతిలో వెళ్లి విజయం సాధించారు. అందుకే ఆమె అంటే ఆయనకు కోపం.'' అని అన్నారు.

నిక్సన్​ వ్యక్తిత్వం అసలు బాగోదు

అమెరికాలో రాయబారిగా పనిచేసిన మీరాశంకర్​ మాట్లాడుతూ '' ఇందిరాగాంధీ అంటే నిక్సన్​కు పడేది కాదు. దాంతోపాటు పాక్​ సాయంతో చైనాతో సంబంధాలు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశారు. '' అని తెలిపారు.

వివిధ దేశాల్లో రాయబారిగా పనిచేసిన ప్రముఖ దౌత్యవేత్త జి.పార్థసారధి తన అభిప్రాయం చెబుతూ ''నిక్సన్​ వ్యక్తిత్వం, మాట తీరు అసలు బాగోదు. పాక్​-చైనా-అమెరికా సంబంధాలు బలపడడానికి ఆయన ప్రయత్నించారు. అయితే అంతర్జాతీయ వేదికలపై ఆయనను ఇందిరాగాంధీ సమర్థంగానే అదుపుచేశారు.'' అని నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. భారత్​-అమెరికా సంబంధాలు సంతృప్తికర స్థాయిలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ వివరాలు వెల్లడికావడం దురదృష్టకరమని విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి సల్మాన్​ హైదర్​ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:మంచులో రెండున్నర గంటలు ఉండి రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.