ETV Bharat / international

మరే అధ్యక్షుడికీ ఇలా జరగకూడదు : ట్రంప్​ - క్రిస్టీన్​ గిల్లీబ్రాండ్

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సరైన ఆధారాలు లేవని మ్యూలర్​ నివేదిక స్పష్టం చేసింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇలాంటి పరిస్థితి మరే అధ్యక్షుడికి రాకూడదని వ్యాఖ్యానించారు.

డొనాల్డ్​ ట్రంప్​
author img

By

Published : Apr 19, 2019, 5:04 AM IST

Updated : Apr 19, 2019, 10:27 AM IST

"మరే అధ్యక్షుడికీ ఇలా జరగకూడదు" : ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు రాబర్ట్​ మ్యూలర్​ నివేదిక క్లీన్​చిట్​ ఇచ్చింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సరైన ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. మ్యూలర్​ ప్రకటనకు సంతోషించిన ట్రంప్... విభిన్న రీతిలో వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి మరే అధ్యక్షుడికి రాకూడదంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఇది నాకు చాలా మంచి రోజు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి కుట్ర లేదని నివేదిక స్పష్టం చేసింది. అలా ఎన్నడూ, ఎప్పటికీ జరగదు. అయితే నా పరిస్థితి మరే అధ్యక్షుడికీ రాకూడదు."- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు అధికారి రాబర్ట్​ మ్యూలర్​ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది అమెరికా.​ రష్యా సహకారంపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ 400 పేజీల నివేదిక స్పష్టం చేసింది. మ్యూలర్​ నివేదికను విడుదల చేశారు అమెరికా అటార్నీ జనరల్​ విలియమ్​ బార్.

నివేదికపై విమర్శలు

మ్యూలర్​ నివేదికను డెమోక్రట్స్​ అధ్యక్ష అభ్యర్థి క్రిస్టీన్​ గిల్లీబ్రాండ్​ తప్పుబట్టారు. పూర్తి నివేదికను కాంగ్రెస్​కు సమర్పించాలని డిమాండ్ చేశారు.

"అమెరికా ప్రజలకు అటార్నీ జనరల్​ ప్రాతినిధ్యం వహించాలి. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు కాదు. అమెరికా ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ పత్రికా సమావేశం సముచితం కాదు. మ్యూలర్​ నివేదికను కాంగ్రెస్​లో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత మాత్రమే అటార్నీ జనరల్​కు ఉంది. దానిని సమీక్షించాల్సిన బాధ్యత మాది."- క్రిస్టీన్​ గిల్లీబ్రాండ్​, డెమోక్రట్స్​​ అధ్యక్ష అభ్యర్థి

ఇదీ చూడండి: రష్యా పర్యటనకు కిమ్​ జోంగ్​ ఉన్​..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
DEPARTMENT OF STATE - AP CLIENTS ONLY
Washington - 18 April 2019
1. US Secretary of State Mike Pompeo walks out with Emirati Foreign Minister Abdullah bin Zayed Al Nahyan, they shake hands, turn and walk back
STORYLINE:
US Secretary of State Mike Pompeo met with Foreign Minister Abdullah bin Zayed Al Nahyan of the United Arab Emirates, at the State Department Thursday.
The two are expected to talk about mutual interests of concern in Afghanistan and Yemen.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 19, 2019, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.