అమెరికాలోని న్యూయార్స్ నగరంలో కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతంలో వైరస్ బారిన పడిన వారిలో ఎక్కువ శాతం మంది నిరుద్యోగులు, పదవీ విరమణ చేసిన వారే ఉన్నారని ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. ఆరు వారాలుగా ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లు స్పష్టమైంది.
న్యూయార్క్లో కరోనా సోకిన వారిలో 37 శాతం మంది విశ్రాంత ఉద్యోగులు, 46 శాతం మంది నిరుద్యోగులు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. బాధితుల్లో నాలుగింట మూడొంతుల మంది 50ఏళ్లు పైబడిన వారే. 17 శాతం మంది మాత్రవే ఉద్యోగం చేస్తున్నారు.