ETV Bharat / international

మోదీ హైతో ముమ్కిన్​ హై: పాంపియో

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైనా సాధించగలరని కొనియాడారు అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో. 'మోదీ హైతో ముమ్కిన్​ హై' అన్న ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని అమెరికాలో జరిగిన యూఎస్​-భారత్​ వాణిజ్య మండలి సదస్సులో ప్రస్తావించారు పాంపియో. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

మోదీ హైతో ముమ్కిన్​ హై: పాంపియో
author img

By

Published : Jun 13, 2019, 9:48 AM IST

అమెరికా రాజధాని వాషింగ్టన్​లో జరిగిన యూఎస్​-భారత్​ వాణిజ్య మండలి సదస్సులో పాల్గొన్న అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో... ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. 'మోదీ హైతో ముమ్కిన్​ హై...' అన్న భారత ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తావిస్తూ... మోదీ ఏదైనా సాధించగలరంటూ ఆ వాక్యాన్ని ప్రస్తావిస్తూ పాంపియో కొనియాడారు.

'మోదీ హైతో ముమ్కిన్​ హై'

"భారత్​-అమెరికా బంధం ఎంతో ముఖ్యమైనది. భారత ప్రభుత్వంతో మున్ముందు జరిపే చర్చలు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు మరింత మెరుగుపడతాయని నేను ఆశిస్తున్నా. వచ్చే వారం జరిగే నా భారత​ పర్యటనలో మోదీని, నూతన విదేశాంగ మంత్రిని కలవడానికి ఎదురుచూస్తున్నా. 'మోదీ హైతో ముమ్కిన్​ హై...' ఈ మాటను ఎన్నికల ప్రచారాల్లో మోదీ అన్నారు. మోదీ ఏదైనా సాధించగలరు. మోదీతో చర్చలు జరపడానికి ఎదురుచూస్తున్నా."
--- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.

అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్​ నేతృత్వంలో అమెరికా-భారత్​ రక్షణ వ్యవస్థలో సహకారం నూతన స్థాయికి చేరిందని పాంపియో అన్నారు. ట్రంప్​-మోదీ యంత్రాంగాలతో ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మంచి అవకాశం లభించిందన్నారు.

ఈ నెల 24 నుంచి 30 వరకు భారత్​, శ్రీలంక, జపాన్​, దక్షిణ కొరియా దేశాల్లో పాంపియో పర్యటించనున్నారు.

ఇదీ చూడండి:- ఆదర్శం: 'భిక్షాటన కంటే ఇదే ఉత్తమం'

Intro:Body:

df

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.