ETV Bharat / international

Modi US tour 2021: జపాన్​ ప్రధానితో మోదీ భేటీ - మోదీతో శంతను నారాయణ్ భేటీ ఫొటోలు

MODI US VIST
మోదీ అమెరికా పర్యటన
author img

By

Published : Sep 23, 2021, 7:33 PM IST

Updated : Sep 24, 2021, 4:28 AM IST

03:05 September 24

సుగాతో మోదీ భేటీ..

జపాన్ ప్రధానమంత్రి యొషిహిదే సుగాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇండో పసిఫిక్​ ప్రాంతం, ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్ ఎకానమీ వంటి అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

"ఉమ్మడి విలువల ఆధారంగా జపాన్​తో ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం చరిత్రలో నిలిచిపోయిది. జపాన్​ ప్రధానితో మోదీ సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్​, ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించారు."

-విదేశాంగ మంత్రిత్వ శాఖ

01:16 September 24

'కమల హారిస్ ఎంతో మందికి స్ఫూర్తి'

ప్రపంచంలోని ఎంతో మందికి కమలా హారిస్ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని మోదీ పేర్కొన్నారు. భారత్​ను సందర్శించాలని కమలను కోరారు.

"భారత్​, అమెరికా సహజమైన భాగస్వామ్య దేశాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నేతృత్వంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయి."

-ప్రధాని మోదీ.

00:44 September 24

కమలా హారిస్​తో మోదీ భేటీ

అమెరికా పర్యటనలో భాగంగా.. ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు. భేటీపై ఇరు దేశాల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. 

'అమెరికాకు భారత్​ అత్యంత ప్రధానమైన భాగస్వామి' అని కమలా హారిస్​ పేర్కొన్నారు. 

23:07 September 23

ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ

అమెరికా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్​ మోరిసన్​తో వాషింగ్టన్​ డీసీలో ప్రధాని మోదీ ​సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. 

భారత్​-ఆస్ట్రేలియా మధ్య మైత్రి బంధాన్ని మరింత మెరుగుపరుచుకునే లక్ష్యంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్​ వేదికగా తెలిపింది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై వారు చర్చించారని పేర్కొంది.

21:44 September 23

బ్లాక్‌స్టోన్ గ్రూప్ సీఈఓ స్టీఫెన్ స్క్వార్జ్‌మన్‌తోనూ ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. భేటీ అనంతరం బ్లాక్‌స్టోన్ గ్రూప్ సీఈఓ స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్ స్పందిస్తూ.. భారత ప్రభుత్వం చేపడుతున్న వివిధ మౌలిక సదుపాయాలతో పెట్టుబడులు ఊపందుకుంటాయని పేర్కొన్నారు.

ప్రధానంగా జాతీయ మోనటైజేషన్ పైప్‌లైన్​ ప్రాజెక్టుతో అందివచ్చే పెట్టుబడి అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

21:37 September 23

సంస్కరణలు.. పెట్టుబడులకు ఊతం..

మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అమెరికాకు చెందిన చాలా కంపెనీలతో పాటు.. నా సహోద్యోగులు భారత్​ను ఆశాజనకమైన గమ్యస్థానంగా భావిస్తున్నారు' అని వివేక్ లాల్ అన్నారు. తాజాగా ప్రకటించిన డ్రోన్ పాలసీ ఉత్తమమైనదని తెలిపారు. ఇతర అంశాల్లోనూ భారత ప్రభుత్వ నిర్ణయాలు, సంస్కరణలు పెట్టుబడులకు ఊతమిస్తాయని స్పష్టం చేశారు.

21:22 September 23

అత్యుత్తమం..

మోదీతో అత్యుత్తమ సమావేశం జరిగిందని జనరల్ అటామిక్స్ సీఈఓ వివేక్ లాల్ అన్నారు. టెక్నాలజీ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. భారత్​లో అమలవుతున్న విధానపర సంస్కరణలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

21:21 September 23

ఆ లక్ష్యాలు సులువే..

మోదీతో భేటీ అనంతరం ఫస్ట్ సోలార్ సీఈఓ మార్ విడ్​మర్ స్పందించారు. దేశ శక్తి, సామర్థ్యాలు, భద్రతపై మోదీ దృష్టి సారించారని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణలో భారత్​ను అనుసరిస్తే దీర్ఘకాలిక వాతావరణ లక్ష్యాలను చేరుకోవడం పెద్ద సమస్య కాదని అభిప్రాయపడ్డారు.

21:17 September 23

అమెరికాలోని వాషింగ్టన్​లో జనరల్ అటామిక్స్ సీఈఓ వివేక్ లాల్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. భారత్​లో రక్షణ రంగ పరికరాల తయారీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యం పెంపుపై చర్చించినట్లు విదేశాంగ కార్యదర్శి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.

20:52 September 23

సౌర పరికరాల తయారీ వ్యూహం..

దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీలో భాగంగా.. 'ఫస్ట్ సోలార్' సీఈఓ మార్క్ విడ్​మర్​తో సమావేశమయ్యారు మోదీ. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగ అభివృద్ధిని విడ్​మర్​కు వివరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ సమావేశంలో భాగంగా.. ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్​ఐ) పథకాన్ని సౌర విద్యుత్ పరికరాల తయారీకి తోడ్పడుతుందని విడ్​మర్​ అభిప్రాయపడ్డారు. భారత్​ను ప్రపంచ సరఫరా వ్యవస్థతో అనుసంధానించవచ్చని తెలిపారు. ప్రత్యేక ఫిల్మ్ టెక్నాలజీతో సౌర పరికరాలు తయారుచేస్తామని ప్రకటించారు. 

20:32 September 23

అమెరికా పర్యటనలో భాగంగా అడోబ్​ ఛైర్మన్​ శంతను నారాయణ్​తో సమావేశమయ్యారు మోదీ. భారత్​లో విద్య, వైద్యం, పరిశోధన, అభివృద్ధి వంటి రంగాల్లో 'డిజిటల్ ఇండియా' కార్యక్రమాలపై సమాలోచనలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 

ప్రధానితో భేటీ అనంతరం అడోబ్ ఛైర్మన్ శాంతను నారాయణ్ స్పందించారు. దేశాభివృద్ధిపై మోదీ ఆలోచనలు చాలా ఆనందిస్తాయని పేర్కొన్నారు.

ఇరువురి మధ్య ఆవిష్కరణల్లో పెట్టుబడులు, సాంకేతికత వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. 'సాంకేతికత ఆధారంగా దేశంలోని యువతకు 'స్మార్ట్' విద్యా బోధన.. పరిశోధనల వేగవంతం, స్టార్టప్ రంగానికి ఊతం వంటి అంశాలను మోదీకి వివరించినట్లు' పేర్కొన్నారు. భారత్​లో అడోబ్ కార్యకలాపాలు, భవిష్యత్తు పెట్టుబడి ప్రణాళికలపై చర్చించారు.  

అలాగే అడోబ్​కు 'అతిపెద్ద ఆస్తి ప్రజలేనని.. భారత్​లో విద్యను ప్రోత్సహించడం, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం అనేది అడోబ్​తో పాటు దేశానికి మద్దతుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యాభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.

19:43 September 23

డిజిటల్ ఇండియాకు మద్దతు..

క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో ఆమోన్​తో నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ అందిస్తున్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. 5జీ, డిజిటల్ ఇండియా రంగాల్లో భారత్​తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అమోన్​ పేర్కొన్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది. ఈ మేరకు మోదీతో జరిగిన సమావేశంపై ఆయన స్పందించారు. భారతదేశంతో భాగస్వామ్యంపై చాలా గర్వంగా ఉందన్నారు. 

19:05 September 23

మోదీ అమెరికా పర్యటన లైవ్ అప్డేట్స్

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల సీఈఓలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా క్వాల్​కామ్​ సంస్థ అధ్యక్షుడు, సీఈఓ క్రిస్టియానో ఆమోన్​తో వాషింగ్టన్​లో ఆయన సమావేశమయ్యారు.

అనంతరం అడోబ్​ ఛైర్మన్​ శంతను నారాయణ్​తో సమావేశమైన మోదీ.. ఫస్ట్​ సోలార్ సంస్థ సీఈఓ మార్క్ విడ్​మర్​తో చర్చలు జరిపారు. సీఈఓలతో సమావేశం సందర్భంగా భారత్​ కల్పిస్తున్న విస్తృత వ్యాపార అవకాశాలను ప్రస్తావించారు మోదీ.

Last Updated : Sep 24, 2021, 4:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.