ETV Bharat / international

సరైన వెంటిలేషన్‌ లేకుంటే వైరస్‌తో ఉక్కిరిబిక్కిరే! - కరోనావైరస్

గదుల్లో గాలి ప్రసరణ వ్యవస్థ డిజైన్‌ సరిగా లేకపోతే వైరస్ వ్యాప్తి ప్రమాదం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచి వెంటిలేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఎక్కువ భాగం వైరస్ లోపలి గోడలకు, ఉపరితలాలకు అతుక్కుపోతున్నట్లు చెప్పారు. దీనిపై పరిశోధనలో భాగంగా అమెరికా శాస్త్రవేత్తల సిమ్యులేషన్లు నిర్వహించారు.

New study explores how coronavirus travels indoors
సరైన వెంటిలేషన్‌ లేకుంటే వైరస్‌తో ఉక్కిరిబిక్కిరే!
author img

By

Published : Jul 31, 2020, 6:54 AM IST

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందా అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. కొన్ని పరిస్థితుల్లో గాలి ద్వారా కొవిడ్‌-19 సంక్రమించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు పలువురు శాస్త్రవేత్తలు ఇటీవల పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు, నైట్‌ క్లబ్‌లు వంటి చోట్ల.. వైరస్‌ గాల్లోనే ఎక్కువ సేపు ఉండొచ్చని, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించకుంటే ఇతరులకు అది అంటుకుంటున్నట్లు కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది. అక్కడ సరైన వెంటిలేషన్‌ వ్యవస్థ లేకపోవడమే ఇబ్బందులకు కారణమవుతున్నట్లు నిపుణులు చెప్పారు. మంచి వెంటిలేషన్‌ వ్యవస్థ వల్ల గదిలోని గాలి నుంచి కొంతమేర వైరస్‌ బయటకు పోతున్నప్పటికీ ఎక్కువ భాగం మాత్రం.. లోపలి గోడలు, ఉపరితలాలకు అతుక్కుపోతున్నట్లు తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అక్కడ గాల్లో చిన్నపాటి సుడిగుండాలు ఏర్పడటమే ఇందుకు కారణమన్నారు. వీటిని అరికట్టేలా గాలి, వెలుతురు ప్రసరణ వ్యవస్థలను ప్రత్యేకంగా రూపొందించాలంటున్నారు.

సుడిగుండాలు తిరిగి గోడలకు..

మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన జియారాంగ్‌ హాంగ్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనను నిర్వహించింది. కొవిడ్‌-19 సోకినప్పటికీ ఆ వ్యాధి లక్షణాలేమీ లేని (అసింప్టమాటిక్‌) 8 మంది నుంచి మాట్లాడేటప్పుడు, శ్వాస బయటకు వదిలేటప్పుడు విడుదలైన ఏరోసాల్స్‌పై వీరు కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ పరిజ్ఞానంతో నిర్దిష్టంగా లెక్కలు కట్టారు. లిఫ్ట్‌, తరగతి గది, సూపర్‌ మార్కెట్‌లో గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి తీరును సిమ్యులేట్‌ చేశారు. తరగతి గదిలో.. వ్యాధి లక్షణాలు లేని అధ్యాపకుడు నిరంతరంగా మాట్లాడిన సందర్భాల్లో 10 శాతం ఏరోసాల్స్‌ను మాత్రమే ప్రస్తుత వెంటిలేటర్లు బయటకు పంపుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మిగతావన్నీ గోడలపై పడుతున్నాయన్నారు. ‘‘వెంటిలేషన్‌ వల్ల గదిలో అనేక చిన్నపాటి సుడిగుండాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా తుంపర్లలో చాలా భాగం వాటిలో చిక్కుకుపోయి సుడులు తిరుగుతున్నాయి. అవి గోడకు ఢీ కొన్నప్పుడు, అక్కడే అతుక్కుపోతున్నాయి. మహమ్మారి వ్యాప్తికి అవి ‘స్థానిక హాట్‌స్పాట్‌’లుగా తయారవుతాయి’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న సువో యాంగ్‌ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో గాలి ప్రవాహాన్ని మ్యాప్‌ చేయడం ద్వారా గదిలో ఏరోసాల్స్‌ పేరుకుపోయే ‘హాట్‌స్పాట్‌’లను శాస్త్రవేత్తలు గుర్తించారు. మెరుగైన వెంటిలేషన్‌, అంతర్గత నిర్వహణల ద్వారా ఇలాంటి హాట్‌ జోన్లను, వ్యాధి వ్యాప్తిని అరికట్టొచ్చన్నారు.

8 - 14 నిమిషాలు..

సరైన వెంటిలేషన్‌ లేకపోవడం వల్ల సాధారణం కన్నా ఎక్కువ సేపు కరోనా వైరస్‌.. గాల్లోనే ఉంటోందని ఇతర పరిశోధనల్లోనూ తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో.. మాటల ద్వారా వెలువడే తుంపర్లు గాల్లో 8 నుంచి 14 నిమిషాల పాటు ఉంటున్నట్లు ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో.. సరైన వెంటిలేషన్‌ లేని, రద్దీ ఎక్కువగా ఉండే గదుల్లో కన్నా ఆరు బయట లేదా ధారాళంగా గాలి వచ్చే గదుల్లో ఉండటమే మేలని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చదవండి: విద్యాహక్కు చట్టాన్ని విస్తరించకుండా సార్వత్రిక విద్య అందేదెలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.