ETV Bharat / international

వెనెజువెలా ఎన్నికల్లో నికోలస్​ మదురో విజయం! - Maduro's electoral victory

వెనెజువెలాలో జరిగిన ఎన్నికల్లో తమ కూటమి భారీ విజయం సాధించిందని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్​ మదురో ప్రకటించుకున్నారు. అయితే ఈ ఎన్నికలను విపక్ష పార్టీలు బహిష్కరించాయి. అంతర్జాతీయంగా కూడా మదురో ఎన్నికపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Maduro alliance claims win in boycotted election
వెనెజువెలా అధ్యక్షుడిగా నికోలస్​ మదురో తిరిగి ఎన్నిక!
author img

By

Published : Dec 8, 2020, 6:01 AM IST

వెనెజువెలా కాంగ్రెస్​కు జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించినట్లు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో రాజకీయ కూటమి ప్రకటించుకుంది. మదురోకు చెందిన యూనైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనుజువెలా సహా కూటమి పార్టీలన్నీ కలిసి ఎన్నికల్లో 67 శాతం ఓట్లు కైవసం చేసుకున్నట్లు తెెలుస్తోంది.

అయితే ఈ ఎన్నికలను ప్రధాన విపక్ష పార్టీలన్నీ బహిష్కరించాయి. ఫలితాలను గుర్తించేది లేదని స్పష్టం చేశాయి. మరోవైపు ఈ ఎన్నికలు మోసపూరితంగా ఉన్నాయని అంతర్జాతీయంగానూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వెనెజువెలా జాతీయ అసెంబ్లీలో.. అమెరికా మద్దతు ఉన్న జువాన్ గువాయిడ్​కు ఇప్పటివరకు ఆధిక్యం ఉంది. కాంగ్రెస్​లో ఉన్న అధికారాన్ని బట్టి గువాయిడే వెనెజువెలా పాలకుడు అని అమెరికా సహా పలు కీలక దేశాలు గుర్తిస్తున్నాయి. అయితే తాజా ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. మదురో విజయంతో విపక్ష నేతగా ఆయన స్థానం మరింత బలహీనంగా మారే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: హింసాత్మకంగా వెనెజువెలా ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.