ETV Bharat / international

విదేశాల్లో కీలక పదవుల్లో 200 మంది భారతీయులు!

author img

By

Published : Feb 15, 2021, 7:34 AM IST

15 దేశాల్లో ఉన్నత స్థాయిలో కీలక పదవుల్లో ఉన్న ప్రవాస భారతీయుల పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు అమెరికా సంస్థ ఇండియాస్పొరా పేర్కొంది. ఫిబ్రవరి 15న 'అమెరికా ప్రెసిడెంట్స్​ డే' సందర్భంగా ఈ జాబితాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

List of Indian diaspora members holding highest positions globally
ప్రవాస భారతీయ కీలక నేతల జాబితా విడుదల!

ప్రపంచవ్యాప్తంగా 550 మిలియన్ల ప్రవాస భారతీయుల్లో 200ల మందికిపైగా ఉన్నత స్థాయిల్లో కీలక పదవుల్లో ఉన్న వారి జాబితా విడుదల కానుంది. వివిధ రంగాల్లో ఉన్న నాయకుల ఘనతలను చాటి చెప్పేందుకు ఈ జాబితా ఉపయోగపడనుంది. సోమవారం(ఫిబ్రవరి 15)న 'అమెరికా ప్రెసిడెంట్స్​ డే' సందర్భంగా తొలిసారి 15 దేశాల్లో కీలక పదవుల్లో ఉన్న ప్రవాస భారతీయుల జాబితాను విడుదల చేయనుంది ఇండియాస్పొరా సంస్థ.

అగ్రరాజ్యం ఉపాధ్యక్ష పదవి చేపట్టిన భారత సంతతి మహిళ కమలా హారిస్ ఈ జాబితాలో​ చేరడం విశేషం. ఇందులో సివిల్​ సర్వెంట్స్​ సహా కీలక పదవుల్లో ఉన్న వారి వివరాలు కూడా ఉన్నాయి.

ఉన్నతస్థాయిలో ఉన్న భారతీయుల ఘనతను చాటాలే ఉన్న ఈ జాబితాను విడుదల చేస్తుండటం ఆనందంగా ఉందని ఇండియాస్పొరా సంస్థ వ్యవస్థాపకుడు ఎం ఆర్ రంగస్వామి అన్నారు. ఈ వివరాలు.. రానున్న తరాలకు ప్రేరణగా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:చైనాలో స్ప్రింగ్​ ఫెస్టివల్​- వీధులన్నీ కలర్​ఫుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.