అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జో బైడెన్ బృందంలో మరో భారతీయ- అమెరికన్‌కు చోటు లభించింది. భారత సంతతికి చెందిన సమీరా ఫాజిల్‌ను యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్‌కు ఎంపిక చేస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో తయారీ, ఆవిష్కరణలు, దేశీయంగా పోటీ వంటి అంశాలను సమీరా పర్యవేక్షించనున్నారు. స్వేతసౌధం డిజిటల్ విభాగంలో కశ్మీరీ మహిళ ఐషా షాని ఎంపిక చేసిన కొన్ని వారాల తర్వాత.. ప్రస్తుతం సమీర ఎంపిక ప్రకటన వెలువడడం గమనార్హం.
కశ్మీర్ మూలాలున్న సయ్యద్ యూసఫ్, రఫిఖా ఫాజిల్ దంపతుల కుమార్తె సమీరా ఫాజిల్. సమీరా పూర్వీకులు అమెరికాలో స్థిరపడగా.. ఆమె ప్రస్తుతం క్లినికల్ లెక్చరర్‌గా ఆమె ప్రస్తానాన్ని మొదలు పెట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అట్లాంటాలో సామాజిక ఆర్థిక అభివృద్ధి శాఖకు డైరెక్టర్‌గా పనిచేశారు. ట్రెజరీ డిపార్ట్మెంట్లోనూ ఆమెకు పనిచేసిన అనుభవం ఉంది.