ETV Bharat / international

'భారత్​, అమెరికా బంధం.. 'కమల'తో మరింత దృఢం' - భారత్​, అమెరికా బంధం గురించి జెన్​ సాకి

అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్​ బాధ్యతలు చేపట్టడం ద్వారా భారత్​, అమెరికా సంబంధాలు మరింత దృఢమవుతాయని శ్వేతసౌధ కార్యాలయం పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్​కు భారత్​తో సుదీర్ఘ అనుబంధం ఉందని తెలిపింది.

ndia-US relationship
'భారత్​, అమెరికాల బంధం.. కమలతో మరింత దృఢం'
author img

By

Published : Jan 22, 2021, 7:54 AM IST

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్​ బాధ్యతలు చేపట్టిన తరుణంలో శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. కమలా హారిస్​ ద్వారా భారత్​, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొంది. ఈ మేరకు శ్వేతసౌధ పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్​ సాకి తెలిపారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటిరోజున విలేకరులతో ఆమె మాట్లాడారు.

"అధ్యక్షుడు జో బైడెన్​.. భారత్​లో అనేక సార్లు పర్యటించారు. భారత్​, అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ఆయన గౌరవిస్తారు. ఇక ముందు కూడా దానిని ఆయన కొనసాగిస్తారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ద్వారా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది."​

-- జెన్​ సాకి, శ్వేతసౌధ పత్రికా వ్యవహారాల కార్యదర్శి

అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారతీయ అమెరికన్​ కమలా హారిస్​.. ప్రమాణ స్వీకారం చేయడం.. చరిత్రాత్మక సందర్భం అని సాకి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'అమ్మ నమ్మకమే నన్ను ఈ స్థాయికి చేర్చింది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.