పోలీసు కర్కశత్వానికి బలైన జార్జి ఫ్లాయిడ్‌కు సంఘీభావం ప్రకటించారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా ఒట్టావాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారుల కోరిక మేరకు మోకాళ్లపై నిల్చొని వారికి మద్దతు ప్రకటించారు ట్రూడో.
మరోవైపు జార్జి ఫ్లాయిడ్ మృతితో ప్రారంభమైన నిరసనలు అమెరికాలో కొనసాగుతున్నాయి. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహించారు. తొలినాళ్లలో హింసాత్మకంగా సాగిన నిరసనలు క్రమంగా శాంతియుతంగా మారుతున్నాయి.
హ్యూస్టన్‌కు చెందిన సంగీత కళాకారులు బన్ బీ, ట్రయే థా.. ఫ్లాయిడ్ మృతికి సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. వేల మంది ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నల్లజాతీయుల హక్కులకు పూర్తి భద్రత కల్పించే విధంగా చట్టసవరణలు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రఖ్యాత డెట్రాయిట్ వంతనపై ప్రజలు ర్యాలీ నిర్వహించారు.
ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసులపై తీవ్రమైన అభియోగాలు మోపడం వల్ల నిరసనలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు అధికారులు చెబుతున్నారు.