ETV Bharat / international

ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కావడం కష్టమే!

నవంబర్​లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నెగ్గడం కష్టమేనని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా కట్టడిలో ట్రంప్ విఫలమయ్యారని అధిక శాతం మంది అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. నిజాయితీ, నమ్మకం, వ్యక్తిగత విలువలు కల్గి ఉండడం వంటి అంశాల్లోనూ... బైడెన్‌ కంటే ట్రంప్ వెనుకబడి ఉన్నట్లు సర్వేలు తేల్చాయి.

It is very difficult for Donald Trump to be President of the United States once again
ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం కష్టమే!
author img

By

Published : Jul 20, 2020, 7:23 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తిరిగి ఎన్నిక కావడం కష్టమేనని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ప్రధాన ప్రత్యర్థి జో బైడెన్‌తో పోలిస్తే ట్రంప్‌కు తక్కువ మంది మద్దతిస్తున్నారని వాషింగ్టన్‌ పోస్ట్, ఏబీసీ న్యూస్‌ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది.

కరోనా కట్టడిలో విఫలం

కరోనా వైరస్ కట్టడిలో ట్రంప్‌ విఫలమయ్యారని ఎక్కువ మంది అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. దీంతో తన మద్దుతుదారులనే ట్రంప్‌ నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించిన ఈ సర్వేలో... ట్రంప్‌కు 40 శాతం మద్దతు తెలపగా... బైడెన్‌కు 55 శాతం మంది మద్దతిచ్చారు. ఇదే విభాగంలో మార్చిలో ట్రంప్‌పై... రెండు పాయింట్లు మెరుగ్గా ఉన్న బైడెన్... మే నాటికి 10 పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.

బైడెన్ బెస్ట్

కరోనా కట్టడిలో ట్రంప్‌ కన్నా... బైడెన్ మెరుగ్గా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు 54 శాతం మంది అమెరికన్లు తెలిపారు. 34 శాతం మంది మాత్రమే... ట్రంప్‌ పనితీరు బాగున్నట్లు పేర్కొన్నారు.

భద్రత, జాతి వివక్ష, దేశాన్ని ఏకం చేయడం, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, నిజాయితీ, నమ్మకం, వ్యక్తిగత విలువలు కల్గి ఉండడం వంటి అంశాల్లో... బైడెన్ కంటే ట్రంప్ వెనుకబడ్డారు. ముఖ్యంగా 61 శాతం మంది ప్రజలు ట్రంప్ ‌దేశాన్ని ఏకం చేయడం బదులు విభజించారని అభిప్రాయపడ్డారు.

ఆర్థిక రంగ నిర్వహణలో బైడెన్‌... ట్రంప్‌తో దాదాపు సమానంగా ఉన్నట్లు వాషింగ్టన్‌ పోస్ట్ తెలిపింది.

ఇదీ చూడండి: కష్టకాలంలోనూ 'ఆధిపత్యమే' చైనా అజెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.