ETV Bharat / international

'ఇది ముగింపు కాదు.. అమెరికా పతనానికి ఆరంభం' - అమెరికా రాజకీయ పరిస్థితులు

బైడెన్​ నియామకాన్ని అడ్డుకునేందుకు అమెరికా క్యాపిటల్​ భవనం వద్ద ట్రంప్​ మద్దతుదారులు సృష్టించిన హింసాకాండ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే.. ఇది అగ్రరాజ్య పతనానికి సూచిక అని ప్రముఖ పాత్రికేయుడు ఆదిత్యా సిన్హా పేర్కొన్నారు. అమెరికా తాజా రాజకీయ పరిణామాలపై 'ఈటీవీ భారత్​'తో ఆయన ముచ్చటించారు. ​

Aditya Sinha opinion
ఇది అమెరికా పతనానికి ఆరంభం:ఆదిత్యా సిన్హా
author img

By

Published : Jan 10, 2021, 3:11 PM IST

ట్రంప్​ మద్దతుదారులు సృష్టించిన అలజడికి అమెరికాలోని క్యాపిటల్​ భవనం అల్లకల్లోలంగా మారింది. ఈ ఘటనతో ప్రపంచ దేశాల ముందు అగ్రరాజ్య ఖ్యాతి పడిపోయినట్లయింది. అయితే.. ఇది ముగింపు కాదని అమెరికా కీర్తి పతనానికి, నైతిక విలువలు కోల్పోయిందనడానికి ఆరంభమని ప్రముఖ పాత్రికేయుడు ఆదిత్యా సిన్హా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత అమెరికా రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగనున్నాయనే అంశంపై 'ఈటీవీ భారత్​' చెన్నై బ్యూరో ప్రతినిధి ఎంసీ రాజన్​తో ఆయన మాట్లాడారు.

ఇది అమెరికా పతనానికి ఆరంభం:ఆదిత్యా సిన్హా

'క్యాపిటల్​' దాడి తర్వాతి అమెరికా రాజకీయాల్లో వచ్చే మార్పు.. నేడో రేపో తెలిసేది కాదని ఆదిత్యా సిన్హా అన్నారు. రాబోయే రోజుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. 1945లో ఇంగ్లాండ్​ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో.. ప్రస్తుతం అమెరికా కూడా అలాంటి స్థితిలోని ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అగ్రరాజ్యంలో విద్వేష, జాత్యహంకార పోకడలు కరుడుగట్టుకు పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్వేతజాతీయుల్లో చాలా మంది అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​న​కు మద్దతు తెలపడం ఇందుకు సాక్ష్యమని వివరించారు.

ఈ పరిణామాలతో జర్మన్​ నియంత హిట్లర్​, అధ్యక్షుడు ట్రంప్​న​కు దగ్గరి పోలికలు ఏర్పడ్డాయని ఆదిత్యా సిన్హా విమర్శించారు. 'క్యాపిటల్​' దాడి ఘటన.. భారత్​కు ఒక హెచ్చరిక అని తెలిపారు. ఈ దాడి వెనుక ఎలాంటి నాయకుడు లేకుండానే జరిగిందంటే నమ్మడానికి వీలు లేదని.. ఈ విధ్వంసానికి కారకుడు ట్రంపేనని అన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.