ETV Bharat / international

అమెరికాలో మనోళ్ల హవా- చదువు, సంపాదనలో టాప్

author img

By

Published : Aug 25, 2021, 7:27 PM IST

చదువు, ఆదాయార్జనలో అమెరికాలోని భారత సంతతి ప్రజలు దూసుకెళ్తున్నారు. అక్కడి పౌరులతో పోలిస్తే రెట్టింపు సంపాదిస్తున్నారు.

indians in us wealth report
అమెరికాలో భారతీయుల ఆదాయాలు

అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. చదువుతో పాటు ఆదాయార్జనలో మనోళ్లు అమెరికన్లతో పోలిస్తే ఎంతో ముందున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. అమెరికాలో గత మూడు దశాబ్దాలలో ఆసియన్ల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణలో తేలింది. అమెరికా జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని ఈ వివరాలు వెల్లడించింది.

దీని ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం 40 లక్షల మంది భారత సంతతి(Indian diaspora in USA) ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో 10 లక్షల మంది అమెరికాలోనే జన్మించగా.. 16 లక్షల మంది వీసా హోల్డర్లు ఉన్నారు. మరో 14 లక్షల మందికి చట్టబద్ధమైన నివాస ధ్రువపత్రాలు ఉన్నాయి.

ఆర్జనలో టాప్..

అమెరికాలో ఒక్కో కుటుంబం సంపాదన జాతీయ సగటు 63,922 డాలర్లు కాగా.. భారత సంతతి కుటుంబాల సంపాదన మాత్రం అంతకు రెట్టింపుగా ఉంది. ఒక్కో భారతీయ కుటుంబం లక్షా 23 వేల 700 డాలర్లను సంపాదిస్తోంది. ఆసియాలోని ఇతర దేశాల ప్రజలతో పోల్చినా భారతీయుల సంపాదనే ఎక్కువగా ఉంది. తైవాన్ కుటుంబాలు 97,129 డాలర్లు ఆర్జిస్తుంటే, ఫిలిప్పీన్స్ సంతతి కుటుంబాలు 95 వేల డాలర్లను వెనకేసుకుంటున్నారు. 14శాతం భారతీయుల కుటుంబాల సంపాదన మాత్రమే 40 వేల డాలర్ల కన్నా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ సంఖ్య 33 శాతంగా ఉండటం గమనార్హం.

చదువులోనూ..

అటు చదువు విషయంలోనూ మనోళ్లే ముందున్నారు. దేశంలోని మొత్తం జనాభాలో కాలేజీ డిగ్రీ ఉన్నవారు 34 శాతం కాగా.. భారతీయుల్లో ఈ సంఖ్య ఏకంగా 79శాతంగా ఉంది.

కంప్యూటర్ సైన్స్, ఫైనాన్సియల్ మేనేజ్​మెంట్, మెడిసిన్ వంటి అధిక జీతాలు వచ్చే ఉద్యోగాల్లో భారత సంతతి ప్రజలు ఎక్కువగా పనిచేస్తున్నారు. అమెరికాలోని మొత్తం వైద్యులలో 9 శాతం మంది భారత సంతతి వ్యక్తులే ఉన్నారు. అందులో సగం మంది ఇమ్మిగ్రెంట్ వీసా మీద వెళ్లినవారేనని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. దేశంలో జరిగే ఎన్నికల్లోనూ ఆసియా అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంది.

ఇదీ చదవండి: 'తాలిబన్లు చంపేసినా ఆ విషయంలో వెనక్కి తగ్గం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.