ETV Bharat / international

'ట్రంప్​ హై తో సేఫ్​ హై' ప్రచారానికి భారతీయ-అమెరికన్​ శ్రీకారం - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు మద్దతుగా ఓ భారతీయ-అమెరికాన్​ 'ట్రంప్​ హై తో సేఫ్​ హై' అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రవాస భారతీయుల ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో వారి నుంచి ట్రంప్​కు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందు కోసం ప్రధాని మోదీ ఎన్నికల నినాదాలు 'మోదీ ఉంటే అన్నీ సాధ్యమే', 'మరోమారు మోదీ సర్కార్'​ వంటి వాటి ప్రేరణతో.. 'ఏక్​ బార్​ ఔర్​ ట్రంప్​ సర్కార్'​ అంటూ అవగాహన కల్పిస్తున్నారు.

donald trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్
author img

By

Published : Oct 10, 2020, 5:11 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రచార పర్వం ఊపందుకుంటోంది. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు మద్దతుగా భారతీయ-అమెరికన్​ వ్యాపారవేత్త, రిపబ్లికన్​ డానీ గైక్వాడ్​.. 'ట్రంప్​ ఉంటే భద్రత ఉంటుంది( ట్రంప్​ హై తో సేఫ్​ హై)' ప్రచారాన్ని ప్రారంభించారు. ట్రంప్​కు అనుకూలంగా ప్రవాస భారతీయుల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశానికి అధ్యక్షుడి మద్దతును చూపుతోందని అక్కడి మీడియా నివేదించింది.

" రేసులో అధ్యక్షుడు ట్రంప్​ వెనకబడినట్లు గమనించా. కాబట్టి ఆయనకు మద్దతుగా నా సొంత డబ్బును ఖర్చు చేస్తున్నా. కొద్ది నెలలుగా అధ్యక్షుడు ట్రంప్​, ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​కు మద్దతుగా నిలిచే అవకాశాలు నాకు లభించాయి. అమెరికాను నడిపించటం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు నాయకత్వం వహించేందుకు ట్రంప్​ సరైన వ్యక్తి అని నేను నమ్ముతున్నా. పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, మిచిగాన్​, ఓహియో వంటి రాష్ట్రాల్లో భారతీయ-అమెరికన్ల ఓట్లు కీలకం. ఆయా కమ్యూనిటీల తొలి తరం ఓటర్లను ప్రభావితం చేసేందుకు భారతీయ టెలివిజన్​ ఛానళ్లు సరైన మార్గమని భావిస్తున్నా. "

- డానీ గైక్వాడ్​, భారతీయ అమెరికన్​.

గైక్వాడ్​ ప్రచార నినాదం.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార నినాదం 'మోదీ హై తో ముమ్కిన్​ హై (మోదీ ఉంటే అన్నీ సాధ్యమే)' దానిపై ఆధారపడి ఉంది. మోదీ మరో నినాదం 'మరో మారు మోదీ సర్కార్'​ నుంచి 'ఏక్​ బార్​ ఔర్​.. ట్రంప్​ సర్కార్'​ అని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు గైక్వాడ్​.' ట్రంపే ఎందుకు? అనేది చెప్పటం చాలా సులభం. ఆయన భారత్​కు మంచి స్నేహితుడు కాబట్టి ట్రంప్​ కావాలి' అని పేర్కొన్నట్లు అమెరికన్​ బజార్​ మీడియా నివేదించింది. మరో 30 సెకన్ల ప్రకటనలో ట్రంప్​ ఎందుకు కాకూడదు? అని పేర్కొంటూ.. వివరణ ఇచ్చారు గైక్వాడ్​. ఆయన అధ్యక్షుడిగా.. మన ఆస్తిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న దోపిడిదారులను, కాల్పులవాదులను ఆపడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మరో వీడియోలో ట్రంప్​ సర్కార్​ తీసుకొచ్చిన పీపీపీ, ఈఐడీఎల్​ఎస్​, ఆర్థిక పునరుద్ధరణ కార్యక్రమాలను కొనియాడారు గైక్వాడ్​.

గైక్వాడ్​ గుజరాత్​లోని బరోడాలో జన్మించి.. అమెరికాలో స్థిరపడ్డారు. రిపబ్లికన్​ పార్టీకి తొలి నుంచి ఆయన మద్దతుదారు. రిపబ్లికన్​ పార్టీకి విరాళం అందించే అతిపెద్ద భారతీయ-అమెరికన్లలో గైక్వాడ్​ ఒకరు. అధ్యక్షుడు ట్రంప్​, ఫ్లోరిడా గవర్నర్​ రోన్​ డెసాంటీస్​, సెనేటర్​ రిక్​ స్కాట్​, మాజీ వ్యవసాయ కమిషనర్​ అడమ్​ పుత్నామ్​లకు భూరీ విరాళాలు అందించారు.

ఇదీ చూడండి: 'బైడెన్​ గెలిస్తే నెలలోపే కమ్యూనిస్ట్​ కమల అధికారం చేపడతారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.