భారతీయ అమెరికన్, న్యూయార్క్ ఐబీఎంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రాజీవ్ జోషిని ప్రతిష్ఠాత్మక 'ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం వరించింది. ఎలక్ట్రానిక్, కృత్రిమ మేధస్సు రంగాల్లో చేసిన విశేష కృషికిగానూ ఈ పురస్కారం లభించింది.
ఇప్పటికే 250 పరికరాలకు అమెరికాలో పేటెంట్లు పొందారు జోషి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఆవిష్కరణలను గుర్తించిన న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్(మేధో సంపత్తి హక్కుల సంస్థ) ఈ సంవత్సర మేటి ఆవిష్కర్త పురస్కారాన్ని రాజీవ్‌కు అందించింది.
![rajiv joshi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7348269_rajiv.jpg)
ముంబయి ఐఐటీలో విద్యాభ్యాసం..
ముంబయి ఐఐటీలో సాంకేతిక విద్యను అభ్యసించారు జోషి. అనంతరం అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు.
'మానవ అవసరాలే స్ఫూర్తి'
తనకు మానవ అవసరాలు, ఆసక్తి తన ఆవిష్కరణలకు స్ఫూర్తి అని చెప్పారు జోషి. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరానని వెల్లడించారు. క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్‌లకు ఆదరణ పెరిగిందని చెప్పుకొచ్చారు ఈ శాస్త్రవేత్త.
ఇదీ చూడండి: 'అగ్ర' హోదా కోసం కాలుదువ్వుతున్న చైనా