భారత్లో ఇటీవల జరిగిన పరిణామాలపై కీలక అభిప్రాయాలు వ్యక్తంచేస్తూ ఓ నివేదిక రూపొందించింది అమెరికాలోని కాంగ్రెషనల్ రీసర్చ్ సర్వీస్(సీఆర్ఎస్). పౌరసత్వ చట్ట సవరణ, ఎన్ఆర్సీ ద్వారా భారతీయ ముస్లింలపై ప్రభావం పడుతుందని విశ్లేషించింది. సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించేందుకు కొన్ని దేశాలు, మతాలను మాత్రమే ఎంపిక చేసిన తీరుపైనా అనుమానాలు లేవెనత్తింది సీఆర్ఎస్.
"భారత్ ప్రభుత్వం ఎన్ఆర్సీని ప్రతిపాదిస్తోంది. దీనితో పాటు సీఏఏ కూడా తోడవటం దేశంలోని ముస్లింల స్థితిపై ప్రభావం చూపుతుంది. పౌరసత్వ చట్టం-1955 ద్వారా అక్రమంగా వచ్చిన వలస వచ్చినవారికి పౌరసత్వం కల్పించలేదు. ఆ తర్వాత ఎన్నో సవరణలు జరిగినా మత ప్రాదిపదికన జరగలేదు."
-కాంగ్రెషనల్ రీసర్చ్ సర్వీస్
సీఆర్ఎస్ అనేది అమెరికా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని స్వతంత్ర పరిశోధన విభాగం. దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చట్ట సభ్యులకు నివేదికలు అందిస్తుంది. అయితే ఇవి అమెరికా కాంగ్రెస్ అధికారిక అభిప్రాయాలు కావు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు