ETV Bharat / international

రక్షణ బిల్లుపై ట్రంప్​ 'వీటో'కు కాంగ్రెస్​ చెక్​ - అమెరికా రక్షణ బిల్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. దేశ రక్షణ బిల్లుపై వేసిన వీటోనూ అగ్రరాజ్య కాంగ్రెస్​ తిరగరాసింది. రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్న సెనేట్​ వీటోను సునాయాసంగా పక్కనపెట్టింది. ట్రంప్​ నాలుగేళ్ల పాలనలో కాంగ్రెస్​ ఈ విధంగా చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

In a first, Congress overrides Trump veto of defense bill
ట్రంప్​కు కాంగ్రెస్​ షాక్​- రక్షణ బిల్లుపై 'వీటో'కు చెక్​
author img

By

Published : Jan 2, 2021, 5:15 AM IST

అమెరికా వార్షిక రక్షణ విధాన బిల్లుపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రయోగించిన వీటో అస్త్రం ఫలించలేదు. ట్రంప్​ వీటోను అమెరికా కాంగ్రెస్​ ధిక్కరించింది. ట్రంప్​ నాలుగేళ్ల పాలనలో ఈ విధంగా జరగడం ఇదే తొలిసారి.

ట్రంప్ వీటోను ధిక్కరించాలంటే ఈ బిల్లును కాంగ్రెస్​లోని ఉభయసభలు మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే రిపబ్లికన్ల చేతిలో ఉన్న సెనేట్​.. ట్రంప్​ వీటోను సునాయాసంగా పక్కనపెట్టింది. 81-13 ఓట్ల తేడాతో వీటోను తిరగరాసింది సెనేట్​. ప్రతినిధుల సభ ఇప్పటికే 322-87తో ట్రంప్​ వీటోను రద్దు చేసింది. బిల్లు ద్వారా అమెరికా దళాల జీతాల్లో అదనంగా 3శాతం పెరగనుంది. దీనితో పాటు రక్షణ విధానాలు, సైన్యం సన్నద్ధత, నూతన ఆయుధ వ్యవస్థ, సిబ్బంది విధానాలు ఇతర మిలిటరీ లక్ష్యాలకు మార్గదర్శకంగా ఈ బిల్లును రూపొందించారు.

కానీ ఈ బిల్లుపై గత వారం ట్రంప్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ భద్రతకు అత్యవసరమైన అంశాలను పొందుపర్చడంలో ఈ రక్షణ బిల్లు విఫలమైందంటూ వీటో అస్త్రాన్ని ప్రయోగించారు​. ఈ బిల్లు వల్ల రష్యా, చైనాలకే ప్రయోజనం కలుగుతుందని, ఆ దేశాలకు ఇదొక బహుమతి వంటిదని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:- యూఎన్​ఎస్​సీలో భారత్​ సరికొత్త అధ్యాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.