ETV Bharat / international

కరోనా నుంచి కోలుకునేందుకు పట్టే సమయమెంత?

కరోనా వైరస్ సోకితే అసలు ఎన్నిరోజుల్లో తగ్గిపోతుంది? ఇది అందరికీ ఉండే సందేహం. కొందరు త్వరగానే కోలుకుంటే.. ఇంకొంత మందిలో మాత్రం దాదాపు 4 నెలల పాటు వ్యాధి లక్షణాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. తగ్గినప్పటికీ.. ఆరోగ్యం మళ్లీ ఎప్పుడు విషమంగా మారుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని వైద్యులు అంటున్నారు.

recovery
కరోనా
author img

By

Published : Oct 13, 2020, 3:52 PM IST

కరోనా వైరస్‌ బారినపడ్డ వ్యక్తి వయస్సు సహా ఇతర అనారోగ్య సమస్యలపై ఆధారపడి.. సదరు బాధితుడు కోలుకోవడం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువ మంది కరోనా రోగుల్లో లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయని.. వారు త్వరగా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కరోనా నుంచి బయటపడడానికి ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలిపారు.

ఊబకాయులు, అధిక రక్తపోటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై.. కొవిడ్ ప్రభావం ఎక్కువ రోజులు ఉంటున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ పరిశోధకులు వెల్లడించారు. కొవిడ్ నుంచి కోలుకోవడానికి కనీసంగా 2 నుంచి 6 వారాల సమయం పడుతుందని తెలిపారు. 18 నుంచి 34 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వారు కరోనా సోకిన తర్వాత ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటే వారు కొవిడ్ నుంచి కోలుకోవడానికి కనీసం 2 వారాల సమయం అవసరమని అమెరికాలో చేసిన ఓ సర్వేలో తేలింది.

పెద్ద వయసు వారిలో..

50 లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వాళ్లు కరోనా బారిన పడితే దాదాపు 50 శాతం మంది 2 వారాల్లోనే కోలుకుంటున్నారు. వీరిలో ఆస్పత్రిపాలు అయిన వారిలో 87 శాతం మంది కోలుకోవడానికి దాదాపు 2 నెలలు పడుతుందని పరిశోధుకులు గుర్తించారు. వీరికి నీరసం, శ్వాస సరిగ్గా అందకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని పరిశోధకులు చెప్పారు. ఇంకొంత మందిలో 3 నుంచి 4 నెలల పాటు కూడా దగ్గు రావడం, శ్వాసపరమైన ఇబ్బందులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు షికాగో వైద్యులు తెలిపారు.

శరీరమంతటా ప్రభావం!

ఈ కారణంగా కొవిడ్‌ రోగులు ఎప్పుడు పూర్తిగా కోలుకుంటారన్న విషయాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టమవుతోందని చెబుతున్నారు. ప్రాథమికంగా ఆరోగ్యం కాస్త కుదుటపడినప్పటికీ మళ్లీ ఎప్పుడు అది విషమంగా మారుతుందో చెప్పడం కూడా క్లిష్టంగా మారుతోందని వైద్యులు అంటున్నారు. కొవిడ్‌- 19 వ్యాధితో శరీరంలో ప్రతి అవయవం కూడా ప్రభావానికి గురవుతుందని పరిశోధకులు చెప్పారు.

కొవిడ్ తర్వాత..

దీర్ఘకాలికంగా గుండెల్లో మంటగా ఉండడం, మూత్రపిండాల పనితీరు మందగించడం, అస్పష్టమైన ఆలోచనలు రావడం, ఆతృత, కుంగుబాటు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్యలకు కేవలం కరోనా వైరస్ ఒక్కటే కారణమా లేక ఇతర ఆరోగ్య సమస్యలా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. వ్యాధి నుంచి కోలుకున్నంత మాత్రాన పూర్తిగా బయటపడ్డట్లు కాదని వైద్యులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: తల్లి నుంచి శిశువుకు కరోనా ముప్పు తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.