ETV Bharat / international

అంతరిక్షయాత్రలో చరిత్ర సృష్టించిన 'స్పేస్​ ఎక్స్​' - స్పేస్ ఎక్స్ కొత్త రికార్డు

అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి వ్యాపారసంస్థగా ఎలాన్ మస్క్​కు చెందిన 'స్పేస్ ఎక్స్' చరిత్ర సృష్టించింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా ఇద్దరు వ్యోమగాములను నింగిలోకి పంపింది. 19 గంటల ప్రయాణం అనంతరం వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరనున్నారు. ఈ ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం.

History in the making: SpaceX propels two NASA astronauts into orbit
అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన స్పేస్ఎక్స్
author img

By

Published : May 31, 2020, 9:36 AM IST

Updated : May 31, 2020, 12:43 PM IST

అంతరిక్షయాత్రలో చరిత్ర సృష్టించిన 'స్పేస్​ ఎక్స్​'

ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్​ మస్క్​కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. ఇద్దరు వ్యోమగాములను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపి.. అంతరిక్ష యాత్రలపై కొత్త ఆశలను చిగురింపజేసింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టిన స్పేస్ ఎక్స్.. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొట్టమొదటి వ్యాపార సంస్థగా రికార్డులకెక్కింది.

స్పేస్ ఎక్స్​కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో.. నాసాకు చెందిన బాబ్ బెన్​కెన్, డౌగ్ హార్లే అనే వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన తొలి వ్యాపారసంస్థగా చరిత్ర సృష్టించింది స్పేస్ ఎక్స్. 19 గంటలపాటు ప్రయాణించిన అనంతరం వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్​ఎస్​) చేరుకుంటారు.

ప్రత్యక్షంగా వీక్షించిన ట్రంప్

​స్పేస్ ఎక్స్ ప్రయోగాన్ని అధ్యక్షుడు ట్రంప్​ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ ప్రయోగం ప్రజల్లో స్ఫూర్తిని నింపుతుందని ఉద్ఘాటించారు. అమెరికా భూభాగం నుంచి దశాబ్దకాలం అనంతరం వ్యోమగాములను పంపినట్లు గుర్తు చేశారు. స్పేస్​ ఎక్స్ సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు ట్రంప్. అమెరికా చరిత్రలో ఇది నూతన అధ్యాయమని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: జంతువుల నుంచి మనుషులకు కరోనా ఇలా వ్యాపించింది!

Last Updated : May 31, 2020, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.