ETV Bharat / international

కరోనాపై పోరుకు ప్రవాసుల భారీ ఆర్థిక సాయం - ప్రవాస భారతీయులు

కరోనా బారిన పడి జీవనోపాధి కోల్పోయి, ఆకలితో అలమటిస్తున్న పేదలకు సాయం చేసేందుకు ప్రవాస భారతీయులు ముందుకొచ్చారు. 'ఛలో గివ్ ఫర్ కొవిడ్​-19' పేరిట 6 లక్షల డాలర్ల విరాళం ప్రకటించారు.

Indian diaspora group raises USD 600K for Coronavirus relief
కరోనాపై పోరుకు ప్రవాస భారతీయుల భారీ ఆర్థికసాయం
author img

By

Published : Apr 10, 2020, 11:46 AM IST

మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరుకు ప్రవాస భారతీయులు నడుంబిగించారు. కరోనా సంక్షోభం కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు ప్రత్యక్ష ఉపశమనం కలిగించడానికి పలువురు భారతీయ అమెరికన్​ కార్పొరేట్ దిగ్గజాలు కలిసి ఆరు లక్షల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

'ఛలో గివ్ ఫర్ కొవిడ్​-19' పేరిట ప్రారంభించిన ఈ నిధుల సేకరణకు.. అగ్రశ్రేణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్​లు, ప్రముఖులు 500 మిలియన్ డాలర్లు విరాళం అందించారు. ఆన్​లైన్​లో నిర్వహించిన ప్రచారానికి స్పందించిన మిగతా ప్రవాస భారతీయులు మరో 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.

భారత్​, అమెరికాలో కరోనా బారిన పడి ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహారం అందించేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. యూఎస్​లో 'ఫీడింగ్ అమెరికా', భారత్​లో 'గూంజ్' సంస్థ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తారు.

ఒకరికొకరు.. సాయం

"కరోనా మహమ్మారి ఇప్పటికే ఆకలి సంక్షోభాన్ని సృష్టించింది. ఇలాంటి సమయంలో కష్టాల్లో ఉన్న వారికి తోటి సమాజం అండగా నిలవాలి. ఇది ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ మంచిని చేకూరుస్తుంది." - ఇంద్రా నూయీ, పెప్సికో మాజీ సీఈఓ

భారత్​లో రోహిణి నీలేకని, నందన్​ నీలేకని, బాలీవుడ్ నటి నందితా దాస్​ కూడా 'ఛలో గివ్ ఫర్ కొవిడ్​-19'కు మద్దతు తెలిపారు.

"ఈ సంక్షోభ సమయంలో సామాన్యులు ఆరోగ్యంతో పాటు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. వారిని తోటి సమాజం ఆదుకోవాల్సిన తరుణమిది."

- రోహిణి నీలేకని

ఇదీ చూడండి: 'బయో ఉగ్రదాడికి ట్రైలర్​ ఈ కరోనా సంక్షోభం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.