ETV Bharat / international

భారత్-అమెరికా మధ్య కీలక చర్చలు- త్వరలో నిర్మల పర్యటన!

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై భారత్‌-అమెరికా దృష్టి సారించాయి. (India US relations) ఇరుదేశాల మధ్య అధికారుల స్థాయి చర్చలు జరగుతున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. (India US news) త్వరలో కేబినెట్‌ మంత్రుల పర్యటనలు ఉంటాయని తెలిపింది. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది.

India US news
India US news
author img

By

Published : Oct 9, 2021, 12:10 PM IST

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్య పర్యటన (Modi US visit) ముగిసిన పక్షం రోజుల్లోనే ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై (India US relations) భారత్‌-అమెరికాలు దృష్టి సారించాయి. ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారుల స్థాయిలో ఆర్థిక, జాతీయ భద్రత వంటి పలు కీలక అంశాలపై (India US news) ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో ఇరుదేశాల కేబినెట్‌ మంత్రుల పర్యటనలు సైతం జరగనున్నట్లు... శ్వేతసౌధం అధికార వర్గాలు పేర్కొన్నాయి. (US India ties)

భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ (CDS Rawat news) త్వరలో అమెరికాలో పర్యటించనుండగా అమెరికా నౌకాదళ అధిపతి సైతం వచ్చేవారం భారత్‌లో పర్యటించనున్నట్లు అగ్రరాజ్యం ఇప్పటికే ప్రకటించింది. అటు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా అతి త్వరలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, నవంబర్‌లో జరిగే భారత్‌-అమెరికా దేశాల రెండో విడత చర్చల్లో (2+2 India US) పాల్గొనేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌ వాషింగ్టన్‌ వెళ్లనున్నారు.

మోదీ అమెరికా పర్యటన

సెప్టెంబర్​ 22న అమెరికాకు బయల్దేరిన (Modi visit to US 2021) ప్రధాని మోదీ.. మూడు రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించారు. మూడు రోజుల పర్యటనలో (Modi visit to US) భాగంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంతో పాటు క్వాడ్​ సదస్సులో (Quad summit) పాల్గొన్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​తో (Biden news) భేటీ అయ్యారు. వ్యూహాత్మక సంబంధాల బలోపేతం గురించి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, భద్రత, వాణిజ్యం సహా పలు కీలక రంగాల్లో అభివృద్ధిపై చర్చించారు. ఉగ్రవాద నిర్మూలన సహా అఫ్గాన్​లో పరిణామాలపై సమాలోచనలు చేశారు.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​, అప్పటి జపాన్​ ప్రధాని యోషిహిదె సుగాతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు మోదీ. మరో మూడు అంతర్గత సమావేశాలకు కూడా మోదీ(Modi news) అధ్యక్షత వహించారు.

ఇదీ చదవండి: 65 గంటల్లో 20 సమావేశాలు- అమెరికా​లో బిజీబిజీగా మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.