ETV Bharat / international

'ఆరోగ్యంగా ఉంటే.. టీకా కోసం 2022 వరకు ఆగాల్సిందే' - కరోనా వ్యాక్సిన్​ డబ్ల్యూహెచ్​ఓ

ఆరోగ్య కార్యకర్తలు, కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉండేవారికి తొలుత వ్యాక్సిన్​ అందివ్వాలని అభిప్రాయపడ్డారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్​ సౌమ్య స్వామినాథన్​. ఈ క్రమంలో ఆరోగ్యవంతులు టీకాను పొందాలంటే 2022వరకు ఆగాల్సి ఉంటుందని తెలిపారు.

Healthy people might have to wait till 2022 to get COVID-19 vaccine: WHO
'ఆరోగ్యంగా ఉంటే.. టీకా కోసం 2022 వరకు ఆగాల్సిందే'
author img

By

Published : Oct 15, 2020, 10:54 PM IST

ఆరోగ్యకరమైన వ్యక్తులు కరోనా టీకా పొందాలంటే.. 2022వరకు వేచిచూడక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ఆరోగ్య కార్యకర్తలు, కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉండేవారికి అధిక ప్రాధాన్యం ఉండే నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ ఈ వ్యాఖ్యలు చేసింది.

2021 నాటికి కనీసం ఒక సమర్థవంతమైన వ్యాక్సిన్​ బయటకు వస్తుందని.. అయితే అది తక్కువ సంఖ్యల్లోనే అందుబాటులో ఉంటుందని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్​ సౌమ్య స్వానినాథన్​ తెలిపారు.

"ఆరోగ్య కార్యకర్తలు, వైరస్​ ముప్పు ఎక్కువగా ఉండే వారికి తొలుత వ్యాక్సిన్​ ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు బయటకువస్తాయి. అయితే నా వరకు.. ఆరోగ్యంగా ఉండేవారు టీకా తీసుకునేందుకు 2022వరకు వేచి చూడాల్సిందే."

-- సౌమ్య స్వామినాథన్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్​.

అయితే టీకా వచ్చిన వంటనే అందరికీ అందుబాటులో ఉంటుంది అనుకోవడం సరికాదన్నారు సౌమ్య. అది అంత త్వరగా, సులభంగా అయ్యే ప్రక్రియ కాదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- 'అలా చేయకపోతే ఐరోపాలో భారీ ప్రాణ నష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.