ETV Bharat / international

'అమెరికా చరిత్రలోనే ట్రంప్​ అసమర్థ అధ్యక్షుడు'

author img

By

Published : Jan 9, 2021, 3:07 PM IST

Updated : Jan 9, 2021, 3:13 PM IST

అమెరికా అధ్యక్షునిగా కొనసాగే అర్హత డొనాల్డ్​ ట్రంప్​కు లేదని విమర్శించారు జో బైడెన్​. దేశ చరిత్రలోనే అత్యంత అసమర్థ అధ్యక్షునిగా ట్రంప్​ నిలిచిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన​ రాకపోవడమే మంచిదని అన్నారు.

'Good thing': Biden after Trump says he won't attend inauguration
'ట్రంప్​ ఓ అసమర్థ అధ్యక్షుడు'

అమెరికా చరిత్రలోనే అత్యంత అసమర్థ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అని నూతన అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్‌ విమర్శించారు. అగ్రరాజ్య అధినేతగా కొనసాగేందుకు ఆయన తగిన వ్యక్తి కాదని అన్నారు. జనవరి 20న జరిగే బైెడెన్​ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాబోనని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. ఆయన రాకపోవడమే మంచిదని బైడెన్‌ ఎద్దేవా చేశారు.

‘"ప్రమాణస్వీకారానికి రాబోనని ట్రంప్‌ అన్నట్లు తెలిసింది. చాలా కొన్ని విషయాల్లో మాత్రమే మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఆయన కార్యక్రమానికి రాకపోవడమే మంచిది. ఆయన ఈ దేశానికి ఇబ్బందికరంగా మారారు. తన చేష్టలతో అమెరికాను అప్రతిష్ఠపాలు చేశారు. అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఆయన అర్హుడు కాదు. దేశ చరిత్రలోనే అత్యంత అసమర్థ అధ్యక్షుడు."

-జో బైడెన్‌, ఎన్నికైన అధ్యక్షుడు

ఇప్పుడు అమెరికా ప్రజలంతా ఆయన ఎప్పుడు దిగిపోతారా? అని ఎదురు చూస్తున్నారని బైడెన్‌ అన్నారు. ట్రంప్‌పై అభిశంసన వార్తలపై ప్రశ్నించగా.. అది పూర్తిగా కాంగ్రెస్‌కు సంబంధించిన విషయమని, దీనిపై ఉభయ సభలు సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. అయితే తాను కూడా ట్రంప్‌ అధ్యక్ష పదవిని వీడే రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అయితే ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రమాణస్వీకారానికి వస్తాననడం సంతోషాన్నిచ్చిందని బైడెన్​ అన్నారు.

మరికొద్ది రోజుల్లో పదవీకాలం పూర్తిచేసుకునే ట్రంప్‌.. చివరి రోజుల్లో తన విపరీత చర్యలతో భంగపాటుకు గురవుతున్నారు. అగ్రరాజ్యానికి తలవంపులు తెచ్చేలా ఇటీవల ఆ దేశ క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేశారు. దీంతో అధ్యక్షుడిపై వ్యతిరేకత తారస్థాయికి చేరింది. ఆయనను పదవి నుంచి తొలగించాలని అటు డెమొక్రాట్లతో పాటు సొంత పార్టీ నేతలు కూడా డిమాండ్‌ చేయడం గమనార్హం. ట్రంప్‌ తనంతట తానే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే అభిశంసన తీసుకొస్తామని అమెరికా చట్టసభ్యులు అంటున్నారు. మరోవైపు క్యాపిటల్‌ భవనంపై దాడి నేపథ్యంలో ఆయన ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది.

ఇదీ చూడండి: బైడెన్ ప్రమాణ స్వీకారానికి నేను రాను: ట్రంప్​

Last Updated : Jan 9, 2021, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.